పిక్ టాక్‌: గుండె జారి పోయిందే!

Last Updated on by

ఆర్‌.ఎక్స్100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌లో వాడి వేడి ఎంతో యూత్‌కి విడ‌మ‌ర్చి చెప్పాల్సిన ప‌నేలేదు. ఈ అందాల రాజ్‌పుత్ క‌న్య‌క తాను న‌టించిన తొలి సినిమాతోనే బోయ్స్ గుండెల్ని కొల్లగొట్టింది. టాలీవుడ్ లో ఒకే ఒక్క సినిమాతో ఎక్క‌డో ట‌చ్ చేసింది. న‌చ్చిన కుర్రాడిని మోహించి, అత‌డితో ఎంజాయ్ చేసి చివ‌రికి ప్రేమ‌కు తూచ్ కొట్టేసే అమ్మాయిగా గొప్ప‌గా అభిన‌యించింది. ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారు క‌దూ! అంటూ యూత్ ఇట్టే క‌నెక్ట్ అయిపోయారు. ఆ సినిమా చూసిన వాళ్ల‌కు ఇంకో సందేహం ఉంది. అస‌లు పాయ‌ల్‌లోని ఎన‌ర్జీ లెవ‌ల్స్‌ని ఇంకా పూర్తిగా టాలీవుడ్ ఉప‌యోగించుకోలేక‌పోతోందని అర్థ‌మ‌వుతుంది.

ప్ర‌స్తుతం పాయ‌ల్ సి.క‌ళ్యాణ్ నిర్మిస్తున్న‌ ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకి క‌మిటైంది. అటు సొంత భాష పంజాబీలో అద‌ర‌గొట్టేస్తూనే, ఇటు టాలీవుడ్‌లో పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వాల‌ని క‌ల‌లు గంటోంది. ఇక్క‌డ రామ్‌చ‌ర‌ణ్‌, అఖిల్ లాంటి హీరోలు సెకండ్ లీడ్ రోల్స్ ఇస్తామంటే నో చెప్పేసి, గ‌ట్స్ చూపించింది. ఏదైనా పెద్ద రేంజు హీరోయిన్‌గానే త‌న‌ని ఎలివేట్ చేసుకోవాల‌నే పంతంతోనే ఉంది. తాజాగా ఇన్‌స్టాగ్ర‌మ్‌లో ఓ కొత్త ఫోటోని షేర్ చేసి షేక్ చేసేస్తోంది. ఈ ఫోటోలో ఎద అందాల్ని ఎంతో అందంగా ఎలివేట్ చేస్తూ మ‌తి చెడే ఫోజు ఇచ్చింది. ఈ ఫోటో ప్ర‌స్తుతం యువ‌త‌రం సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అయిపోతోంది. గుండె జారి పోయిందే! అంటూ ఒక‌రు.. గుండె జారి గ‌ల్లంత‌య్యిందే అంటూ ఇంకొక‌రు పాయ‌ల్ అందాల్ని తెగ పొగిడేస్తున్నారు.

User Comments