వావ్.. ఆ ఫిల్మ్ ఫెస్టివల్ లో మన పెళ్లిచూపులు

టాలీవుడ్ 2016 క్యాలెండర్ లో ఓ చిన్న సినిమా సాధించిన అద్వితీయమైన విజయాన్ని అంత తొందరగా ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే, ఆ సినిమా ‘పెళ్లిచూపులు’ కనుక.

ఈ జనరేషన్ యూత్ ఫుల్ సినిమాగా తెరకెక్కి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ పెళ్లిచూపులు ఎలాంటి అంచనాలు లేకుండా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ ను కూడా మెస్మరైజ్ చేసిన విషయం తెలిసిందే.

అందుకే కలెక్షన్స్ విషయంలో కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి స్టార్ హీరోల సినిమాలకే పెద్ద షాక్ ఇచ్చి.. చిన్న సినిమాలకు బిగ్ బాస్ లా నిలిచింది. ఈ క్రమంలో ఉత్తమ తెలుగు చిత్రంగా, ఉత్తమ సంభాషణలకు గాను పెళ్లిచూపులు సినిమా జాతీయ అవార్డులను కూడా గెలుచుకుని సత్తా చాటింది.

అందుకే మరి పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా మన పెళ్లిచూపులు ను రీమేక్ చేయడానికి రెడీ అయిపోతున్నారు.

ఇక ఈ క్రేజీ సినిమా తాజాగా ఏడాది కూడా పూర్తి చేసుకోవడంతో.. యువ హృదయాల్లో మరోసారి పెళ్లిచూపులు మెదిలే ఉంటాయి.

ఇదిలా ఉంటే, ఇప్పుడు ఉన్నట్టుండి ఇలాంటి టైమ్ లో మన ‘పెళ్లిచూపులు’ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కడం విశేషం.

ఈ సినిమా ఇప్పుడు ప్రతిష్టాత్మక 2017 మెల్ బోర్న్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితం కానుందని తాజాగా న్యూస్ బయటకొచ్చింది.

దీంతో ఏటా ఆస్ట్రేలియాలో ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ గా జరిగే ఈ సెలబ్రేషన్స్ కు ఇప్పుడు పెళ్లిచూపులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుందని అంటున్నారు.

ఇకపోతే, విజయ్ దేవరకొండ, రీతూవర్మ జంటగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పెళ్లిచూపులు సినిమాను రాజ్ కుందూరి నిర్మించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుని ఏడాది కూడా పూర్తి చేసుకున్న సినిమా ఇప్పుడు మళ్ళీ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితం కానుందంటే నిజంగా విశేషమనే అనాలి.

Follow US