నగరానికి కూడా పెళ్లిచూపులు సెంటిమెంట్

Last Updated on by

ఇండ‌స్ట్రీలో ద‌ర్శ‌కుల‌కు సెంటిమెంట్లు కామ‌న్. ఒక్క సినిమా చేసినా.. రెండు సినిమాలు చేసినా.. క‌లిసొచ్చిందంటే మ‌ళ్లీ మ‌ళ్లీ రిపీట్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు త‌రుణ్ భాస్క‌ర్ కూడా ఇదే చేస్తున్నాడు. ఈ కుర్రాడు చేసిందే ఒక్క సినిమా. అది పెళ్లిచూపులు.. జూన్ 29, 2016న విడుద‌లైంది ఈ చిత్రం. సైలెంట్ గా వ‌చ్చి సంచ‌ల‌నం సృష్టించింది పెళ్లిచూపులు. ఇక ఇప్పుడు రెండేళ్ల‌కు ఈ న‌గ‌రానికి ఏమైంది అంటూ వ‌స్తున్నాడు ఈ కుర్ర ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని కూడా జూన్ 29నే విడుద‌ల చేయ‌బోతున్నారు.

పెళ్లిచూపులు సెంటిమెంటా లేదంటే అలా కుదిరిందా తెలియ‌దు కానీ తొలి సినిమా వ‌చ్చిన రోజే రెండో సినిమాను కూడా విడుదల చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. దీనికి నిర్మాత సురేష్ బాబు కూడా ఓకే చెప్పాడు. అప్పుడు క‌బాలితో పోటీప‌డిన ఈ ద‌ర్శ‌కుడు.. ఇప్పుడు సంజూతో సై అంటున్నాడు. ఈ రెండు సినిమాలు ఒకేరోజు విడుద‌ల కానున్నాయి. యూత్ ను టార్గెట్ చేస్తూ ఈ న‌గ‌రానికి ఏమైంది తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు త‌రుణ్. ఖచ్చితంగా ఈ సినిమా కూడా అల‌రిస్తుందనే న‌మ్ముతున్నాడు ఈ కుర్ర ద‌ర్శ‌కుడు.

User Comments