ఆమ‌నిని ప‌ట్టించుకోలేదేం

Last Updated on by

సీనియ‌ర్ క‌థానాయిక ఆమ‌ని గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నేలేదు. విశ్వ‌న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ అంత‌టివాడితో కె.విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `శుభ సంక‌ల్పం` చిత్రంలో న‌టించింది. జ‌గ‌ప‌తిబాబు స‌ర‌స‌న ఫ్యామిలీ డ్రామాలెన్నిటిలోనో పెళ్లాంగా న‌టించింది. రాజేంద్ర ప్ర‌సాద్‌, న‌రేష్ వంటి స్టార్ల స‌ర‌స‌న ఉర‌క‌లెత్తించే పెర్ఫామెన్స్‌తో నాడు ఆక‌ట్టుకుంది. అలాంటి మేటి న‌టి ఇంట‌ర్వ్యూ అంటూ మీడియా ముందుకొస్తే ఎవ‌రూ ప‌ట్టించుకోనేలేదు.

మిస్టర్ పెళ్ళాం, శుభలగ్నం, శుభ సంకల్పం, శుభప్రదం. ఘరానా బుల్లోడు, జంబలకిపంబ వంటి అనేక సూపర్ హిట్ సినిమాల్లో న‌టించిన ఆమ‌నికి ఈ గ‌తి ఎందుకు ప‌ట్టింది? అంటే రాంగ్ టైమింగ్ అని పీఆర్ స‌రిగా లేక‌పోవ‌డ‌మేన‌ని అంటున్నారు. ఈ అందాల భామ ప్రత్యేక పాత్రలో నటించిన `ఐపీసీ సెక్షన్ భార్యాబంధు` ఈ నెల 29న విడుదల కానుంది.శరత్ చంద్ర-నేహా దేశ్ పాండే హీరోహీరోయిన్లుగా.. రెట్టడి శ్రీనివాస్ దర్శకత్వంలో ఆలూరి క్రియేషన్స్ పతాకంపై ఆలూరి సాంబశివరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు ఆమని. పెళ్లయినవాళ్లతోపాటు, పెళ్లికావాల్సినవాళ్లంతా తప్పక చూడాల్సిన సినిమా ఐపీసీ సెక్షన్ భార్యాబంధు అని చెప్పారు.

User Comments