ఈ నెగిటివ్ ప్ర‌చారం ఇక ఆప‌రా..?

ఈ రోజుల్లో ఏదైనా సినిమా విడుద‌లైందంటే చాలు.. బాగుంది అనే వాళ్లు త‌క్కువే. కానీ అందులో ఏం లేదు.. సినిమా వేస్ట్ అనుకునే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. రివ్యూలు అనేవి అన‌లైటిక‌ల్ గా రాయ‌డం మానేసి చాలా కాల‌మైంది. ప‌ర్స‌న‌ల్ గా అటాక్ చేస్తున్నారు ఇప్పుడు. కొంద‌రు అని కాదు.. చాలా వ‌ర‌కు సోషల్ మీడియాలో, కొన్ని వెబ్ సైట్లలలో.. ఛానెల్స్ లో గానీ ద‌ర్శ‌కుల క‌ష్టాల‌ను ప‌ట్టించుకోరు.. వాళ్ల టాలెంట్ ను గుర్తించ‌రు.. కేవ‌లం త‌మ‌కు ఉన్న ప‌ర్స‌న‌ల్ కోణాన్ని తీసుకుని ప్రేక్ష‌కుల‌పై రుద్దేస్తున్నారు. తాజాగా విడుద‌లైన ప‌ద్మావ‌తి ట్రైల‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తుంది. ఈ చిత్రంతో క‌చ్చితంగా సంజ‌య్ లీలా భ‌న్సాలీ మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్ట‌డం ఖాయం అంటున్నారు అత‌డి అభిమానులు. ముఖ్యంగా అల్లావుద్దీన్ ఖిజ్లీగా ర‌ణ్ వీర్ సింగ్ గెట‌ప్ అదిరిపోయిందంటున్నారు.
ఈ గెట‌ప్ పైనే ఇప్పుడు కొంద‌రు మాత్రం గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఉన్న విల‌న్ ఖాల్ డ్రోగో కారెక్ట‌ర్ ను దించేసాడ‌ని భ‌న్సాలీని త‌ప్పు ప‌డుతున్నారు.
Padmavati movie
అయితే ఆ కారెక్ట‌ర్ ను ఒక‌వేళ దించేసినా కూడా ఇప్పుడు అది ప్రేక్ష‌కుల‌కు న‌చ్చిందా లేదా అనేది పాయింట్. న‌చ్చేలా కాపీ కొట్ట‌డం ఎప్పుడూ త‌ప్పు కాదు. భ‌న్సాలీ కూడా అదే చేసాడు. త‌న‌కు న‌చ్చిన విష‌యాన్ని సినిమాలో ఇన్స్ స్పిరేష‌న్ గా వాడాడు. అది బాగుందా లేదా అని చెప్ప‌కుండా.. ట్రైల‌ర్ లో ఇంటెన్స్ లేదు.. షాహిద్ క‌పూర్ ను స‌రిగ్గా చూపించ‌లేదు.. దీపిక‌ను ఆవిష్క‌రించలేదు.. ర‌ణ్ వీర్ సింగ్ గెట‌ప్ ను కాపీ కొట్టాడు అంటూ బాలీవుడ్ లో కొంద‌రు ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడేస్తున్నారు. ఓ సినిమా కోసం ద‌ర్శ‌కుడు ఎంతగా త‌ప‌న ప‌డుతున్నాడో అనే విష‌యాన్ని వాళ్లు గుర్తించ‌ట్లేదు. ఇలాంటి ప్ర‌య‌త్నం చేసిన‌పుడు క‌నీసం ఆ ద‌ర్శ‌కుడిని మెచ్చుకోక‌పోయినా ప‌ర్లేదు.. అత‌డి క‌ష్టాన్ని అవ‌మానించ‌క‌పోతే చాలు..