మ‌ళ్లీ పెట్రోల్, డీజిల్ పై బాదుడు

Last Updated on by

ప్రస్తుతం మార్కెట్లో.. లీటర్ పెట్రోల్ ధర మరో 15 పైసలు పెరిగి రూ.76.69గా ఉంది. మూడు నెలల క్రితం.. అంటే.. ఇదే రోజు 2018 జులై 17వ తేదీ 74.29గా ఉంది. అలాగే.. లీటర్ డీజిల్ ధర 16 పైసలు పెరిగి రూ.71.46గా ఉంది. మూడు నెలల క్రితం లీటర్ డీజిల్ ధర రూ.69.55గా ఉంది. ఈ రకంగా.. హెచ్చుతగ్గులకు లోనవుతూ.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు మళ్లీ రూ.7లు పెరిగితే.. లీటర్ పెట్రోల్ ధర రూ.84లు అవుతుంది. ఇక డీజిల్ రూ.78లు అవుతుంది

అంతర్జాతీయంగా నెలకొన్న తాజా పరిణామాల దృష్ట్యా.. పెట్రోలు ధరలు పెరిగే అవకాశం మెండుగా కనిపిస్తోంది. దుబాయ్‌లో.. పెట్రోల్ బావులుంటాయని సాధారణంగా.. మనందరికీ తెలిసిందే. గతవారం సౌదీ అరేబియాలోని అరామ్కో ఆయిల్ రిఫైనరీ కంపెనీలో జరిగిన డ్రోన్ దాడి కారణంగానే చమురు ధరలు పెరనున్నాయి. ప్రపంచంలోనే పెట్రో ఉత్పత్తులు ప్రాసెసింగ్ చేసే అతిపెద్ద కంపెనీ.. అరామ్కో ఆయిల్. హుతీ రెబెల్స్ చేసిన డ్రోన్ దాడిలో.. సౌదీలోని అబక్ అండ్ ఖురాయిస్‌లో ఉన్న క్రూడ్ ఆయిల్ బావులు దెబ్బతిన్నాయి. దీంతో.. కంపెనీ తమ ఉత్పత్తిని సగానికి సగం తగ్గించింది. దెబ్బతిన్న క్రూడ్ ఆయిల్ బావులను బాగు చేశాకే ఉత్పత్తిని పెంచుతామని స్పష్టం చేసింది.ఈ క్రమంలో వచ్చే 15 రోజుల్లో లీటర్‌పై రూ.7 నుంచి 10 వరకు చమురు ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Related Posts