పేట‌ రివ్యూ

Last Updated on by

న‌టీన‌టులు: ర‌జ‌నీకాంత్, సిమ్ర‌న్, విజ‌య్ సేతుప‌తి, మేఘ ఆకాష్‌, బాబి సింహా, న‌వాజుద్దీన్ సిద్ధిఖి త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం: కార్తీక్ సుబ్బ‌రాజు
నిర్మాత‌: అశోక్ వ‌ల్ల‌భ‌నేని (తెలుగు వెర్ష‌న్)
సంగీతం: అనిరుధ్
జోన‌ర్: రివెంజ్ డ్రామా, కామెడీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌

సంక్రాంతి బ‌రిలో మూడు స్ట్రెయిట్ సినిమాల‌తో పోటీప‌డుతూ సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ న‌టించిన `పేట‌` తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా భారీ పోటీ న‌డుమ‌ థియేట‌ర్ల స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. అయినా వ‌చ్చే సోమ‌వారం నుంచి ర‌జ‌నీ సినిమాయే నిల‌బ‌డుతుంది అంటూ నిర్మాత అశోక్ వ‌ల్ల‌భ‌నేని కాన్ఫిడెన్స్ ని వ్య‌క్తం చేశారు. మునుపటి ర‌జ‌నీని ఈ సినిమాలో చూడొచ్చ‌ని అన్నారు. అయితే ఆయ‌న అంచ‌నాలు నిజ‌మ‌య్యేలా, ర‌జ‌నీ అభిమానుల్ని ఏమాత్రం నిరాశ‌ప‌ర‌చ‌ని విధంగా ఈ సినిమా ఉందా? అంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

క‌థ‌:
పేట .. టైటిల్‌కి త‌గ్గ‌ట్టే ఇది ఒక పేట‌లో న‌డిచే క‌థాంశం. అక్క‌డ క‌థానాయ‌కుడికి విల‌న్ గ్యాంగ్స్‌ కి మ‌ధ్య జ‌రిగే గ్యాంగ్ వార్, అందులోనే ర‌జ‌నీ- సిమ్ర‌న్‌ ప్రేమ‌క‌థ, అస‌లు ర‌జ‌నీ హాస్ట‌ల్‌ వార్డెన్ గా ఉండ‌డానికి కార‌ణ‌మేంటి? త్రిష‌తో ర‌జ‌నీ క‌నెక్ష‌న్ ఎంటి? ఈ క‌థ‌లో న‌వాజుద్దీన్, బాబి సింహా గ్యాంగ్ ల‌తో ర‌జ‌నీ ఎందుకు పోరాడాల్సి వ‌చ్చింది? అస‌లు పేట వీర‌గా ఉండే ర‌జ‌నీ కాళిగా ఎందుకు మారాల్సొచ్చింది? అన్న‌ది ఆద్యంతం తెర‌పై చూడాల్సిందే. అన్ని సినిమాల్లానే ఈ సినిమాలోనూ ప్రేమ‌, ఉద్వేగం, యాక్ష‌న్, సెంటిమెంట్, స్నేహం అన్ని అంశాల మేలుక‌ల‌యిక‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

క‌థాంశంలోకి వెళితే.. `పేట`లోని కాలేజ్ లో బాబిసింహా గ్యాంగ్ అరాచ‌కాల్ని హెచ్చ‌రిస్తాడు హాస్ట‌ల్ వార్డెన్ కాళి(ర‌జ‌నీకాంత్). ఆ క్ర‌మంలోనే బాబి సింహాకు కాళికి మ‌ధ్య వైరం మొద‌లవుతుంది. కాలేజ్ స్టూడెంట్ మేఘా ఆకాష్ త‌న ప్రేమ‌కు స‌హ‌క‌రించ‌మ‌ని కాళిని ప్రాధేయ‌ప‌డుతుంది. మేఘ ల‌వ్ కి స‌హ‌క‌రించాల‌నుకున్న కాళికి మేఘ మమ్మీ సిమ్ర‌న్ తో ప‌రిచ‌యం పెరుగుతుంది. ఆ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారుతుంది. ఆ ఫన్నీ ల‌వ్ స్టోరి న‌డుస్తుండ‌గానే.. గ్యాంగ్ వార్స్ న‌డుమ విజ‌య్ సేతుప‌తి ఎంట్రీ. కాలేజ్ గొడ‌వ‌ల్లో త‌ల‌దూర్చిన సేతుప‌తితో ర‌జ‌నీకి ఉన్న క‌నెక్ష‌న్ ఏంటి? ఈ క‌థ‌లోనే కాళి కాస్త పేట వీర‌గా ఎలివేట్ అవ్వ‌డం, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఫ్యామిలీ గొడ‌వ‌ల్లో భాగంగా న‌వాజుద్దీన్ సోద‌రుడిని పేట వీర హ‌త‌మారిస్తే, ఆ త‌ర్వాత ఆ గొడ‌వ‌ల వ‌ల్ల‌నే పేట వీర స్నేహితుడు శ‌శికుమార్, త్రిష బాంబ్ బ్లాస్ట్ లో మ‌ర‌ణించ‌డం, ఆ బ్లాస్ట్‌లో ర‌జ‌నీ బ‌య‌ట‌ప‌డ‌డం వ‌గైర మెలో డ్రామాని తెర‌పై చూడాల్సిందే.

ప్ల‌స్ పాయింట్స్:
ఈ సినిమాకి ర‌జ‌నీకాంత్ న‌ట‌న‌, ఆహార్యం పెద్ద ప్ల‌స్. నిర్మాత‌లు చెప్పిన‌ట్టే పాత ర‌జ‌నీ క‌నిపించారు. కొన్ని యాక్ష‌న్ బ్లాక్స్‌లో ర‌జ‌నీ మార్క్ స్ట‌యిల్ ఆక‌ట్టుకుంటుంది. విజ‌య్ సేతుప‌తి పాత్రను మ‌లిచిన తీరు ఆక‌ట్టుకుంది. అయితే ఇందులో ఎన్నో పాత్ర‌లు వ‌చ్చి వెళుతుంటాయి. ర‌జ‌నీ, విజ‌య్ సేతుప‌తి పాత్ర‌లకు ఎక్కువ స్కోప్ క‌నిపిస్తుంది. త్రిష‌, సిమ్ర‌న్ పాత్ర‌ల‌కు అస్స‌లు న‌టించే స్కోప్ అన్న‌దే ఉండ‌దు. అవి కేవ‌లం గెస్ట్ పాత్ర‌ల్లా వ‌చ్చి వెళ‌తాయి. బాబి సింహా, న‌వాజుద్దీన్ త‌మ ప‌రిధి మేర చక్క‌గా న‌టించి మెప్పించారు.

మైన‌స్ పాయింట్స్:
ఈ సినిమాకి క‌థే ఓ మైన‌స్. కార్తీక్ సుబ్బ‌రాజు ఎంచుకున్న క‌థ ప‌ర‌మ రొటీన్. త‌ర్వాత ఏం జ‌రుగుతుందో ముందే చెప్పేసేంత వీక్ స్టోరీని ఎంచుకున్నాడు. అయితే ర‌జ‌నీ మార్క్ చూపించేందుకు అత‌డు చేసిన ప్ర‌య‌త్నం ప్ర‌శంసించ‌ద‌గిన‌ది.

సాంకేతిక విభాగం:
కెమెరా వ‌ర్క్, అనిరుధ్ సంగీతం, ఆర్.ఆర్ ఫ‌ర్వాలేదు. ఎడిటింగ్ మ‌రింత షార్ప్ గా ఉండాల్సింది.

చివ‌ర‌గా:  రొటీన్ `పేట‌`. ర‌జ‌నీ అభిమానుల‌కు త‌ప్ప ఇత‌రుల‌కు నిరాశే.

రేటింగ్‌: 2.25/ 05

రిలీజ్ తేదీ: 10, జ‌న‌వ‌రి 2019

User Comments