టాప్ టెక్నీషియ‌న్ పైకి రాడేం?

Last Updated on by

తెర ముందు క‌నిపించి హీరోల‌కు ఉండే గుర్తింపు తెర‌వెన‌క హీరోల‌కు ఉండ‌దు. అందులో ఎంద‌రో గొప్ప సినిమాటోగ్రాఫ‌ర్లు తెర‌వెన‌కే ఉండిపోతున్నారు. టాలీవుడ్‌లో టాప్ సినిమాటోగ్రాఫ‌ర్ల‌ జాబితా తిర‌గేస్తే అందులో క‌చ్ఛితంగా ఉండే పేరు పీజీ విందా. ప్ర‌తిష్ఠాత్మ‌క జె.ఎన్‌.టీ.యులో సినిమాటోగ్ర‌ఫీ కోర్సు పూర్తి చేసిన విందా అటుపై ప‌లు బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేశాడు. అయితే విందా తొలి నుంచి ఎంచుకున్న మార్గం చాలా స్లోఫేస్‌లోనే క‌నిపిస్తోంది. త‌న‌కు ఉన్న అపార జ్ఞానంతో అత‌డు ప్ర‌తి ఫ్రేమ్‌ని ఎంతో అందంగా మ‌ల‌చ‌గ‌ల నిపుణుడు. అయితే అత‌డు ప‌ని చేసే సినిమాలే ఓ మోస్త‌రు బ‌డ్జెట్‌తో అత‌డిని ఎలివేట్ చేసేవి కావు.

తొలుత ఇంద్ర‌గంటితో కెరీర్ మొద‌లుపెట్టాడు. అష్టాచెమ్మా, గ్ర‌హ‌ణం చిత్రాల‌కు ప‌ని చేశాడు. ఆ త‌ర‌వాత మ‌ధుర శ్రీ‌ధ‌ర్‌తో ప‌ని చేశాడు. అటుపై పూరి కాంపౌండ్‌లో అడుగు పెట్టాడు. పూరి కాంపౌండ్ స‌పోర్టుతో అత‌డు ప‌లు చిత్రాల‌కు ప‌ని చేశాడు. అయితే అత‌డి క్వాలిటీ వ‌ర్క్‌ని ఎలివేట్ చేసే సినిమా ఏదీ కెరీర్‌లో ప‌డిన‌ట్టే అనిపించ‌లేదు. తాజాగా ఈ టాప్ టెక్నీషియ‌న్ సుధీర్‌బాబు – ఇంద్రగంటి మోహ‌న్ కృష్ణల కాంబినేష‌న్ మూవీ `స‌మ్మోహ‌నం`కు ఛాయాగ్ర‌హ‌ణం అందించాడు. ఈ సినిమాని అంద‌మైన ఫ్రేమ్స్‌తో మ‌లిచిన ఘ‌న‌త విందాదే. ప్ర‌తి స‌న్నివేశాన్ని ఎంతో బ్యూటిఫుల్‌గా చిత్రీక‌రించాడు. అయితే ఇత‌ర టెక్నీషియ‌న్లకు వ‌చ్చినంత ఎలివేష‌న్ అత‌డికి ఎందుక‌నో మిస్సవుతుంద‌నే అనిపిస్తోంది. ఓ ర‌కంగా రాజ‌మౌళితో ప‌ని చేసిన సెంథిల్ టెక్నిక్‌తో స‌మాన‌మైన టెక్నిక్‌ని ఉప‌యోగించ‌గ‌లిగే నిపుణుడు విందా. కానీ ఎందుక‌నో టాప్ ద‌ర్శ‌కుల చెంత‌కు అత‌డు చేర‌కుండా దూరంగా ఉండిపోయాడు. ప్ర‌స్తుతం ఇంద్ర‌గంటి మోహ‌న్‌కృష్ణ‌తో కెరీర్‌ని ట్రావెల్ చేస్తున్నాడు. జెంటిల్‌మేన్ త‌ర‌వాత స‌మ్మోహ‌నం అత‌డికి బ్రేకింగ్ పాయింట్‌. అయితే అత‌డు ఇంకా పెద్ద స్థాయికి టేకాఫ్ అవ్వ‌గ‌ల నేర్ప‌రి. స్వ‌త‌హాగానే మృధు స్వ‌భావి అయిన విందాతో ద‌ర్శ‌కుల‌కు ప‌ని చేయించుకోవ‌డం సులువు. అత‌డు ఎవ‌రికి కావాల్సిన విధానంలో అయినా ఒదిగిపోగ‌ల వ్య‌క్తిత్వం క‌నిపిస్తుంది. అయితే అత‌డి ఆలోచ‌న‌ల్లో స్లే ఫేస్ విధాన‌మే ఓ ర‌కంగా వెన‌క్కి త‌గ్గేట్టు చేస్తుందేమోన‌ని అత‌డి స‌న్నిహితులు భావిస్తుంటారు. చూద్దాం.. ఇక‌నైనా టాలీవుడ్‌లో అగ్ర ద‌ర్శ‌కుల‌తో క‌లిసి ప‌ని చేసేందుకు ప్ర‌ణాళిక‌లు వేస్తాడేమో?

User Comments