ఫోక్రాన్ వాస్త‌వాలు దాచేశారు!

Last Updated on by

1998లో భార‌త‌ దేశ రాజ‌కీయాలు, ఫోక్రాన్ అణుప‌రీక్ష‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఆస‌క్తిక‌ర చిత్రం `ప‌ర‌మాణు`. జాన్ అబ్ర‌హాం క‌థానాయ‌కుడు. క్రై అర్జ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ప్రేర‌ణ అరోరా నిర్మించారు. ఈ సినిమాలో అణుబాంబ్ త‌యారీకి సంబంధించిన ర‌హ‌స్యాల్ని శత్రుదేశాల‌కు లీక్ చేయ‌డం అన్న పాయింట్ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తుందిట‌. అయితే నిన్న‌టిరోజున రిలీజైన ఈ చిత్రంలో వాస్త‌వాల్ని య‌థాత‌థంగా చూపించారా? అంటే ఫిక్ష‌న్‌కే ఎక్కువ ప్రాధాన్య‌త‌నిచ్చార‌ని విమ‌ర్శ‌కులు విశ్లేషిస్తున్నారు. వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా క‌థ రాసుకున్నా.. ఫిక్ష‌న్ జోడించి క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దార‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

ఈ శుక్ర‌వారం అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజైన‌ `ప‌ర‌మాణు` ప్రేక్ష‌కాభిమానుల, విమ‌ర్శ‌కుల మెప్పు పొందుతోంది. ముఖ్యంగా ప‌తాక‌స‌న్నివేశాల్లో జాన్ అబ్ర‌హాం న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాకి ప్ర‌ముఖ బాలీవుడ్ క్రిటిక్స్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ 4/5 రేటింగ్ ఇచ్చారంటే అర్థం చేసుకోవ‌చ్చు. వాస్త‌వాల‌కు ఫిక్ష‌న్ జోడించి తెర‌కెక్కించిన ఈ సినిమా గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో అద్భుతంగా ఉంద‌ని స‌మీక్ష‌లు తేల్చాయి. కొద్దిపాటి ఫిక్ష‌న్ ఉంద‌ని విమ‌ర్శించినా ఓవ‌రాల్‌గా సినిమా హ‌త్తుకుంద‌న్న విశ్లేష‌ణ‌లు వెలువ‌డ్డాయి. ప‌ర‌మాణు దాదాపు 2205 స్క్రీన్ల‌లో రిలీజైతే, అందులో 1935 ఇండియ‌న్ స్క్రీన్లు ఉన్నాయి. విదేశాల్లో 270 స్క్రీన్ల‌లో రిలీజ్ చేశారు.

User Comments