ప‌వ‌న్ స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్నాడా?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త సినిమా ఈ రోజు మొద‌లు కాబోతోంది. పింక్‌కి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఆ సినిమాని ఈ రోజే హైద‌రాబాద్‌లో మొద‌లుపెట్ట‌బోతున్నారు. ముహూర్తం ఈ రోజే కానీ, ప‌వ‌న్ మాత్రం ఫిబ్ర‌వ‌రి నుంచి సెట్లోకి అడుగు పెట్ట‌బోతున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌కి స‌ర్‌ప్రైజ్‌గా ఈ రోజే ఈ చిత్రంలోని తొలి పాట‌ని విడుద‌ల చేయ‌బోతున్నార‌ని స‌మాచారం.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజకీయాల‌తో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ… ఆయ‌న చేయ‌నున్న `పింక్‌` రీమేక్ కోసం ఎప్ప‌ట్నుంచో ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు ప్ర‌త్యేకంగా ఈ సినిమాపై దృష్టిపెట్టి ప‌నుల్ని చేయిస్తున్నారు. అందులో భాగంగానే పాట‌ల్ని కూడా సిద్ధం చేయించిన‌ట్టు తెలుస్తోంది. ప‌వ‌న్ ఫ్యాన్స్‌లో మ‌రింత జోష్‌ని పెంచేలా ఈ రోజే ఆ పాట‌ని విడుద‌ల చేయొచ్చ‌ని ప్ర‌చారం సాగుతోంది. వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా చిత్రీక‌ణ కూడా శ‌ర‌వేగంగా సాగబోతోంద‌ట‌. క‌థానాయిక‌లు అంజ‌లి, నివేదా థామ‌స్‌, అన‌న్య‌తోపాటు మ‌రో ఇద్ద‌రు పేర్లు కూడా ఈ చిత్రంలో న‌టిస్తున్న‌ట్టు ప్ర‌చారంలో ఉన్నాయి.