జై ల‌వ‌కుశ‌కు పైర‌సీ బెడ‌ద‌.. 

జై ల‌వ‌కుశ‌ విడుద‌లై మంచి టాక్ తెచ్చుకుంది. ఎన్టీఆర్ కెరీర్ లోనే హైయ్య‌స్ట్ ఓపెనింగ్స్ దిశ‌గా అడుగేస్తుంది ఈ చిత్రం. ఇప్ప‌టికే మూడు రోజుల్లోనే 79 కోట్ల గ్రాస్.. వ‌సూలు చేసింది ఈ చిత్రం. జై ల‌వ‌కుశ జోరు చూస్తుంటే మ‌రో మూడు రోజుల్లోనే 100 కోట్ల మార్క్ అందుకునేలా క‌నిపిస్తుంది. అంతా బాగానే ఉంది కానీ ఈ చిత్రానికి పైర‌సీ బెడ‌ద కూడా ఇలాగే ఉంది. ఈ మ‌ధ్య కాలంలో ఏ పెద్ద సినిమా కూడా విడుద‌లైన వారం రోజుల వ‌ర‌కు కూడా పైర‌సీ ప్రింట్ బ‌య‌టికి రాలేదు. కానీ జై ల‌వ‌కుశ మాత్రం విడుద‌ల రోజే బ‌య‌టికి వ‌చ్చేసింది. ఇది ఎక్క‌డో దుబాయ్ లో రిలీజ్ అయిన‌పుడే అక్క‌డ్నుంచే పైర‌సీ చేసార‌ని అనుమానిస్తున్నారు సైబ‌ర్ టీం.
ఇప్ప‌టికే నిర్మాత క‌ళ్యాణ్ రామ్ కూడా పైర‌సీ దారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ కోరారు. దానికితోడు ఎన్టీఆర్ కూడా ద‌య‌చేసి పైర‌సీ ఎంక‌రేజ్ చేయొద్ద‌ని ప్రేక్ష‌కుల‌ను కోరుతున్నాడు. అలాంటి వాళ్లు ఎక్కుడైనా ఉన్నా కూడా త‌మ‌కు తెలియ‌జేయాలంటున్నాడు జూనియ‌ర్. ఎంతైనా విడుద‌లైన రెండు రోజుల్లోనే పైర‌సీ ఇలా విచ్చ‌ల‌విడిగా దొరికేస్తుండ‌టం మాత్రం నిర్మాత‌లకు శాప‌మే. అది కూడా సెల‌వుల సీజన్ కు తోడు పాజిటివ్ టాక్ వ‌చ్చిన సినిమా. మ‌రి ఈ పైర‌సీ భూతం నుంచి జై ల‌వ‌కుశ త‌ప్పించుకుని ఎంత‌వ‌ర‌కు త‌ట్టుకుంటుందో చూడాలిక‌..!