వ‌ర్మ‌పై పోలీస్ కేసు

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌కు వివాదాల‌తో చెలిమి చేయ‌డం కొత్తేం కాదు. వివాదం ఎక్క‌డుంటే వ‌ర్మ అక్క‌డుంటాడ‌న్న‌ది ప‌చ్చి నిజం. వేదిక‌, సంద‌ర్భం ఏదైనా స‌రే అక్క‌డ వ‌ర్మ మార్క్ కాంట్ర‌వ‌ర్శీ ఉండాల్సిందే. అలాంటి వివాదాలు వ‌ర్మ ఇన్నేళ్ల‌ ప్ర‌యాణంలో కోకొల్ల‌లు. ఇక గ‌త కొన్ని నెల‌లుగా వ‌ర్మ ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడిని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ప్ర‌తిప‌క్ష నేత జ‌గన్మోహ‌న్ రెడ్డితో క‌లిసి ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో వెన్నుపోటు రాజ‌కీయాల గురించి చెప్పాడని ఆరోప‌ణ‌లున్నాయి. నాటి నుంచి వ‌ర్మ‌ను టీడీపీ నాయ‌కులు టార్గెట్ చేయ‌డం ఒక‌రిపై ఒక‌రు కేసులు పెట్టుకోవ‌డం తెలిసిందే. తాజాగా మరో అడుగు ముందు కేసి వ‌ర్మ చంద్ర‌బాబునాయుడు ని డీగ్రేట్ చేస్తూ మార్పింగ్ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసాడు.

దీంతో బాబు అభిమానులు ఒక్క‌సారిగా భ‌గ్గుమ‌న్నారు. తాజాగా స‌త్య‌నారాయ‌ణ చౌద‌రి అనే ఓ అభిమాని బాచుప‌ల్లి పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసాడు. ఫిర్యాదు ప‌రిశీలించిన అనంత‌రం పోలీసులు వ‌ర్మ పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. సైబ‌ర్ క్రైమ్ వింగ్ కేసును ప్ర‌త్యేకంగా తీసుకుని ద‌ర్యాప్తు మొద‌లు పెట్టారు. అయితే ఇలాంటి వ్వ‌వ‌హారాలు వ‌ర్మ‌కు కొత్తేం కాదు. చాలాసార్లు పోలీస్ స్టేష‌న్ కు విచార‌ణకు వెల్లిన అనుభ‌వాలున్నాయి. ప‌లుమార్లు పోలీస్ లు కౌన్సిలింగ్ ఇచ్చినా ఆయ‌న వ్య‌క్తిత్వ మాత్రం మార్చుకోలేదు. మ‌రీ కేసుపై వ‌ర్మ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూద్దాం.