ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై పోలీస్ కేసు

Last Updated on by

వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల నేప‌థ్యంలో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ ప్ర‌చార ప‌నుల్లో బిజీగా ఉన్నారు. రాష్ర్టంలో అన్నిచోట్లు సుడిగాలి ప‌ర్య‌ట‌న చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్ప‌టికే ఆయ‌న పోటీ చేస్తోన్న గాజువాక‌, భీమ‌వ‌రం స్థానాల‌కు నామినేష‌న్ కూడా వేసారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ రాష్ర్ట ముఖ్య‌మంత్రి ఎపీ రాజ‌కీయాల‌లో వైకాపాతో క‌లిసి ప‌నిచేస్తాన‌న‌డం వంటి అంశాల‌పై ప‌వ‌న్ ఆ పార్టీని దుయ్య బెట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే శుక్ర‌వారం భీమ‌వ‌రం లో జ‌రిగిన స‌భ‌లో ప‌వ‌న్ మాట్లాడుతూ, `తెలంగాణ‌, పాకిస్తాన్` అన్నవ్యాఖ్య‌ల‌పై కేసీఆర్ ఫాలో వ‌ర్స్ మండిప‌డుతున్నారు. అడ్వ‌కేట్ జేఏసీ ఈ మేర‌కు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యదు చేసింది.

ప‌వ‌న్ ఎన్నిక‌ల‌ ల‌బ్ది పొంద‌డం కోసం కేసీఆర్ పై నోరు పారేసుకున్నార‌ని, ఇదే కొన‌సాగితే ఊరుకునేది లేద‌ని అడ్వ‌కేట్ జేఏసీ పేర్కొంది. జ‌న‌సేన పార్టీ తెలంగాణ లో పార్ట‌మెంట్ కు పొటీ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొంద‌రి అభ్య‌ర్ధుల‌ను కూడా ప్ర‌క‌టించారు. ఇన్నాళ్లు తెలంగాణ‌లో స‌రైన ప్ర‌తిప‌క్షం లేక‌పోవ‌డంతో కేసీఆర్ ఆట‌లు న‌డిచాయ‌ని, ఇక‌పై వాటికి చెక్ పెట్ట‌డం ఖాయ‌మ‌నే తెలంగాణ జ‌నసైనుకుల నుంచి బ‌లంగా వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ నాయ‌కులు ప‌వ‌న్ ను ఆదిలోనే అణ‌దొక్కాల‌నే కుట్ర‌లో భాగంగానే ఇలా పోలీసు కేసులు పెడుతున్నార‌ని జ‌న సైనికులు కేసీఆర్ పై మండిప‌డుతున్నారు.

User Comments