వ‌దంత‌లు సృష్టిస్తే వ‌ద‌లం

ఇతర రాష్ట్రాల నుండి హంతక ముఠాలు వచ్చాయని ఇతరత్రా వదంతులు మళ్లీ సామాజిక మాధ్యమాలలో కనిపిస్తున్న విషయం పోలీసు అధికారులు పసిగట్టారు. ఏమాత్రం నిజం కాని ఇటువంటి వదంతులు ప్రచారం చేసేవారిపై క్రిమిన‌ల్ కేసులు నమోదు చేస్తూ కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్.పి. రెమా రాజేశ్వరి అధికారులను ఆదేశించారు. ఆయా వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ల‌కు కూడా ఇటువంటి వ్యక్తుల పట్ల కఠినంగా ఉండాలని, లేనిపక్షంలో వాళ్లు కూడా ఇబ్బందుల్లో పడతారని అధికారి సూచించారు. పోలీసు శాఖకు చెందిన నిఘా విభాగం, సైబర్ టెక్నికల్ అధికారులు ఇప్పటికే వదంతుల విషయమై ఆరా తీస్తున్నారు.