బూతు బొమ్మకు పోలీసులు షాక్

Last Updated on by

ఇష్ట‌మొచ్చిన‌ట్లు చేస్తానంటే ఇక్క‌డ కుద‌ర‌దు. ఇండియాలో ఫ్రీడ‌మ్ ఉంటుంది. కానీ దాన్ని మిస్ యూజ్ చేస్తే శిక్ష కూడా ఉంటుంది. ఇప్పుడు వ‌ర్మ‌కు ఈ శిక్ష కాని శిక్ష ప‌డింది. ఈయ‌న ఈ మ‌ధ్యే గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ అంటూ ఓ సినిమా చేసాడు. దానికి జిఎస్టీ అనే షార్ట్ కట్ పేరు కూడా పెట్టారు. ఇందులో మొత్తం న్యూడ్ గా ఉండే స‌న్నివేశాలు చిత్రీక‌రించాడు వ‌ర్మ‌. దీనికోసం మియా మాల్కోవాను ఇండియాకు తీసుకొచ్చాడు. పోర్న్ యాక్ట్రెస్ కావ‌డంతో వ‌ర్మ‌కు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. కానీ అది విడుద‌లైన త‌ర్వాత కావాల్సిన‌న్ని విమ‌ర్శ‌లు అందుకున్నాడు ఆర్జీవి.

ఈ జీవి చేసిన ప‌నికి అన్ని చోట్ల నుంచి విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిసింది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని విడుద‌ల చేసిన విమియో డాట్ కామ్ కూడా అందులోంచి సినిమాను తీసేసారు. దానికి కార‌ణం పోలీస్ ల నుంచి కంప్లైంట్ రావ‌డ‌మే. అస‌భ్య‌క‌ర‌మైన దృశ్యాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు వెళ్ల‌డంతో ఈ చిత్రాన్ని పూర్తిగా నెట్ లోంచి తొల‌గించారు. దీనిపై వ‌ర్మ ఇంత‌వ‌ర‌కు ఏం స్పందించ‌లేదు. కానీ జిఎస్టీ 2 చేస్తాన‌ని ఈ మ‌ధ్యే అనౌన్స్ చేసాడు వ‌ర్మ‌. ఇప్పుడే ఇంత ర‌చ్చ జ‌రుగుతుంటే.. ఫ్యూచ‌ర్ లో ఇంకెంత రచ్చ చేస్తాడో ఈ ద‌ర్శ‌కుడు.

 

User Comments