సింహా వ‌ర్సెస్ బోయ‌పాటి

Last Updated on by

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో న‌టిస్తూ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. క్రిష్ ఈ చిత్రాన్ని శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్ప‌టికే రెండో షెడ్యూల్‌లో అడుగుపెట్టింది టీమ్‌. ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య ఎవ‌రి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తారు? ఈ ప్ర‌శ్న‌కు ఇంత‌వ‌ర‌కూ ఏ క్లారిటీ లేదు. ఓవైపు మాస్ డైరెక్ట‌ర్స్‌ బోయ‌పాటి, వి.వి.వినాయ‌క్ మ‌ధ్య ట‌గ్ ఆఫ్ వార్ న‌డుస్తోంది. ఎవ‌రికివారు మాంచి అదిరిపోయే మాస్ మ‌సాలా స్క్రిప్టును రెడీ చేసి బాల‌య్య‌బాబుని ఒప్పించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. అయితే ఈ రేసులో బోయ‌పాటి ఒక‌డుగు ముందే ఉన్నాడ‌ని తాజా స‌మాచారాన్ని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.

బాల‌య్య కోసం బోయ‌పాటి టీమ్ ఇప్ప‌టికే ఓ అద్భుత‌మైన స్క్రిప్టును రెడీ చేస్తోంది. ఈసారి న‌ట‌సింహా పొలిటిక‌ల్ జ‌ర్నీకి సాయ‌ప‌డే సినిమా చేయాల‌న్న‌ది బోయ‌పాటి ప్లాన్. అందుకు త‌గ్గ క‌థ‌ను ఎం.ర‌త్నం రెడీ చేస్తున్నాడు. ఇది పూర్తిగా సెటైరిక‌ల్ పొలిటిక‌ల్ డ్రామా అని తెలుస్తోంది. 2019 స‌మ్మ‌ర్‌లో సినిమా ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉందిట‌. అంటే ఈలోగానే ఎన్టీఆర్ సినిమా రిలీజై, బాల‌య్య రిలాక్స్‌డ్ మూవ్‌మెంట్‌లో ఉంటారు. అటుపై బోయ‌పాటితో క‌థా చ‌ర్చ‌లు పూర్తి చేసి బ‌రిలో దిగిపోతార‌న్న‌మాట‌. ఇక ఈ సినిమాలో బాల‌య్య ఇమేజ్‌కి త‌గ్గట్టు డైలాగ్స్, యాక్ష‌న్ భారీగా ఉంటుంద‌ని తెలుస్తోంది.

User Comments