పూజాకు కోటి తాంబూలం

Last Updated on by

ముకుంద‌, ఒక లైలా కోసం, డీజే వంటి చిత్రాల్లో న‌టించింది పూజా హెగ్డే. బాలీవుడ్‌లో మొహంజోదారో లాంటి క్రేజీ ప్రాజెక్టులో న‌టించింది. కెరీర్ ప‌రంగా ఎక్కువ గ్యాప్ తీసుకున్న ఈ భామ‌, ఇటీవ‌ల టాలీవుడ్‌లో కంబ్యాక్ అయిన తీరు ప్ర‌త్యేకంగా చ‌ర్చ‌కొచ్చింది. ముఖ్యంగా బెల్లంకొండ కాంపౌండ్‌లో న‌టిస్తున్న ఈ భామ‌కు తాంబూలం బాగానే ముడుతోంద‌న్న చ‌ర్చ సాగుతోంది.

ఈ భామ బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా ఆడిపాడుతోంది. `సాక్ష్యం` అనేది టైటిల్‌. ఈ చిత్రానికి పూజాకు కోటి పారితోషికం, అద‌న‌పు సౌక‌ర్యాలు అందాయ‌ని తెలుస్తోంది. ఇక‌పోతే కోటి అంత‌కుమించిన పారితోషికం ఇస్తే కుర్ర‌హీరోల‌కు ఈ భామ అడ్డుచెప్ప‌ద‌ల‌. మ‌రోవైపు ఎన్టీఆర్ స‌ర‌సన అర‌వింద స‌మేత చిత్రంలో న‌టిస్తోంది. మ‌హేష్ స‌ర‌స‌న వేరొక సినిమాకి క‌మిటైంది. అలానే ప్ర‌భాస్ స‌ర‌స‌న జిల్ ద‌ర్శ‌కుడి సినిమాకి సంత‌కం చేసింది. యువ‌హీరోల‌కు అయితే కోటి పైగా డిమాండ్ చేస్తున్న ఈ భామ అగ్ర‌హీరోల సినిమాల‌కు డిమాండ్ చేయాల్సిన ప‌నేలేకుండా భారీ పారితోషికాలు అందుకుంటోంది. రామ్‌చ‌ర‌ణ్ `రంగ‌స్థ‌లం`లో ఐటెమ్ పాట‌కు 50ల‌క్ష‌లు అందుకున్న ఈ భామ ఊహించ‌ని ట్రీట్‌నే ఇచ్చింది ఫ్యాన్స్‌కు. కోటి పైగా అందుకుంటోంది కాబ‌ట్టి కుర్ర హీరోల సినిమాల‌కు త‌న‌వైన గ్లామ‌ర్ ఎలివేష‌న్ అస‌లైన యూఎస్‌పీ అన్న‌మాట‌!

User Comments