ర‌కుల్ ను ఫాలో అవుతున్న పూజాహెగ్డే

Last Updated on by

అవును.. ఇప్పుడు ర‌కుల్ ను అచ్చంగా ఫాలో అయిపోతుంది పూజాహెగ్డే. ఇద్ద‌రూ బాలీవుడ్ నుంచే వ‌చ్చినా కూడా ర‌కుల్ తెలుగులో ముందే పాగా వేసింది. ఇప్పుడు పూజా టైమ్ న‌డుస్తుంది. ఇక్క‌డ వ‌ర‌స సినిమాల‌తో ర‌చ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతం మ‌హేశ్ బాబు సినిమాలో న‌టిస్తుంది ఈ భామ‌. డెహ్రాడూన్ లో ఈ చిత్రషూటింగ్ జ‌రుగుతుంది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కుడు. దిల్ రాజు, అశ్వినీద‌త్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో పూజాహెగ్డే క్యారెక్ట‌ర్ ఏంటో ఇప్పుడు బ‌య‌టికి వ‌చ్చింది. ఇందులో వీడియో గేమ్ డెవ‌ల‌ప‌ర్ గా న‌టిస్తుంది పూజా. ఇక్క‌డే చిన్న ట్విస్ట్ ఉంది. స‌రిగ్గా మూడేళ్ల కింద ర‌కుల్ కూడా ఈ పాత్ర‌లో న‌టించింది. బ్రూస్లీ సినిమాలో ర‌కుల్ వీడియో గేమ్ డెవ‌ల‌ప‌ర్ గా న‌టించింది. అందులో చెర్రీ పైనే గేమ్ ప్లాన్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఇప్పుడు పూజాహెగ్డే కూడా మ‌హేశ్ సినిమాలో వీడియో గేమ్ డెవ‌ల‌ప‌ర్ గానే న‌టించ‌బోతుంది. మొత్తానికి అప్పుడు ర‌కుల్ చేసిన ప‌నే ఇప్పుడు పూజా చేస్తుంది. మొత్తానికి.. అందులో ర‌కుల్ క్యారెక్ట‌ర్ పెద్ద‌గా పేల‌లేదు. మ‌రి ఇప్పుడు పూజాకైనా ఆ రేంజ్ వ‌స్తుందో లేదో..?

User Comments