పూజా రొట్టె నెయ్యిలో

Last Updated on by

రొట్టె విరిగి నెయ్యిలో ప‌డ‌డం అంటే ఇదే! డీజే బ్యూటీ పూజా హెగ్డే వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్టుల‌కు సంత‌కాలు చేస్తూ దూసుకుపోతోంది. ఊపిరిస‌ల‌ప‌ని షెడ్యూల్స్‌తో ఈ ముంబై బ్యూటీ ప్యాక‌ప్ అయిపోయింది. పూజా న‌టించేవ‌న్నీ భారీ ప్రాజెక్టులే. ఓవైపు ఎన్టీఆర్ స‌ర‌స‌న `అర‌వింద‌స‌మేత‌` చిత్రం ప్ర‌స్తుతం ఆన్‌సెట్స్ ఉంది. మ‌రోవైపు మ‌హేష్ – వ‌క్కంతం వంశీ క్రేజీ కాంబినేష‌న్ సినిమాకి సంత‌కం చేసింది. త‌దుప‌రి ప్ర‌భాస్ స‌ర‌సన జిల్ ఫేం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ భామ న‌టించ‌నుంది.

Pooja Hegde Got Bumper Offer

ఇన్ని సినిమాలు క్యూలో ఉన్నా.. క్ష‌ణం తీరిక లేని స‌న్నివేశం ఉన్నా.. ఈ భామ బాలీవుడ్‌లో వేరొక క్రేజీ ప్రాజెక్టుకు సంత‌కం చేసింది. కిలాడీ అక్ష‌య్‌కుమార్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్న `హౌస్‌ఫుల్ 4`చిత్రంలో న‌టించ‌నుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా ప్రారంభం కానుంద‌ని పూజా స్వ‌యంగా ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించింది. ఈరోజు `హౌస్‌ఫుల్ 4` లుక్ టెస్ట్ చేస్తున్నార‌ని .. ముందున్న‌ది క్రేజీ టైమ్‌.. అంటూ చెప్పుకొచ్చింది. ఎన్‌జిఇ మూవీస్ ప‌తాకంపై ఈ చిత్రం తెర‌కెక్కనుంది. సాజిద్‌ఖాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో అక్ష‌య్‌, రితేష్ దేశ్‌ముఖ్‌, కృతిస‌నోన్, పూజా హెగ్డే, బొమ‌న్ ఇరానీ త‌దిత‌ర‌లు న‌టిస్తున్నారు.

User Comments