ఎన్టీఆర్-పూజాను విడ‌గొట్టిన త్రివిక్ర‌మ్

Last Updated on by

అవును.. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా ఉన్నా ఇదే నిజం. ఒకే సినిమాలో జంట‌గా న‌టిస్తున్న ఈ ఇద్ద‌ర్నీ ఇప్పుడు విడ‌గొట్టిన పాపం మాత్రం మాట‌ల మాంత్రికుడిదే. అస‌లు విష‌యం ఏంటంటే అర‌వింద స‌మేత షూటింగ్ మామూలు స్పీడ్ లో సాగ‌డం లేదిప్పుడు. ఒక్క రోజు కూడా బ్రేక్ లేకుండా ఈ ప‌ని కానిస్తున్నాడు త్రివిక్ర‌మ్. అక్టోబర్ నాటికి.. అందులోనూ ద‌స‌రాకు విడుద‌ల కావాల‌ని ఎన్టీఆర్ అల్టిమేటం జారీ చేయ‌డంతో ఆఘ‌మేఘాల మీద అర‌వింద స‌మేత‌ను సిద్ధం చేస్తున్నాడు మాట‌ల మాంత్రికుడు.

ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర తాజా షెడ్యూల్ కూడా పూర్తైంది. దాంతో పూజాహెగ్డే ట్విట్ట‌ర్ లో త్రివిక్ర‌మ్ తో త‌న ఆనందాన్ని పంచుకుంటూ ఫోటో పోస్ట్ చేసింది. అయితే ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ లేక‌పోవ‌డం విచిత్రం. ఈ విష‌యం పూజా చెప్పేవ‌ర‌కు కూడా ఎవ‌రికీ తెలియ‌దు. తార‌క్ నిన్ను మిస్ అవుతున్నా.. నెక్ట్స్ షెడ్యూల్లో క‌లుద్దాం అంటూ ట్వీట్ చేసింది పూజా హెగ్డే. ఇదే నెల‌లో త‌ర్వాతి షెడ్యూల్ మొద‌లు కానుంది. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునీల్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. మొత్తానికి అజ్ఞాతవాసితో గాడిత‌ప్పిన త్రివిక్ర‌మ్ కెరీర్ కు ఇప్పుడు అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ కీల‌కంగా మారింది. చూడాలిక‌.. ఏం చేస్తాడో..?

User Comments