పూజాకు డిజే కిక్కు

ముకుందా సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన పూజాకు ఆ సినిమా పెద్ద ప్లస్ కాలేదు. ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది తప్ప అంతకు మించి పెద్దగా ఉపయోగం లేదు.  ఆ తరువాత ఒక లైలా కోసం అంటూ.. నాగచైతన్యతో నటించింది. అదీ ఫ్లాప్ కావడంతో.. టాలీవుడ్ అమ్మడుకి కలిసి రాలేదు అనుకున్నారు.  దీంతో దర్శకులు కూడా పూజావైపు చూడటం మానేశారు. అన్నీ రోజులు ఒకేలా ఉండవు కదా.. పోయిన లక్కును డిజే రూపంలో తిరిగి తెచ్చుకుంది పూజ. డిజే సినిమా మంచి హిట్ కావడంతో పూజ దశ తిరిగింది.  వెంటనే రెండు సినిమాలు వచ్చాయి.

అందులో ఒకటి బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా కాగా, రెండోది నాగచైతన్య సినిమా. శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.  2018 జనవరిలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక రెండోది నాగచైతన్యతో చేస్తోంది. ఒకలైలా కోసం సినిమాలో హోమ్లీ గా కనిపించిన పూజ నాగా చైత్యన్య తో చేస్తున్న రెండో చిత్రంలో గ్లామరస్ గా కనిపిస్తోందట. చందు మొండేటీ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇవే  కాకుండా ఈ అమ్మడు మరో రెండు చిత్రాల్లో కూడా నటించే అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. ఒక్క సినిమా హిట్ అయితే వచ్చే లాభాలు ఏమిటో పూజాకు బాగా అర్ధం అయింది. అవకాశాలు వరసగా వస్తుండటంతో.. సంబ్రమాశ్చర్యాల్లో మునిగిపోతోంది పూజ.