ప్ర‌భాస్ వ‌ల్ల‌ పూజాకు కునుకు క‌రువు!

Last Updated on by

ఏంటి ప్ర‌భాస్ వ‌ల్ల ఒక అందాల భామ‌కు క‌ష్టాలొచ్చాయా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌లో ఈజ్ అంత‌కంత‌కు రెట్టింప‌వుతోంది. బాహుబ‌లి సిరీస్ త‌ర్వాత అంత‌కుమించిన భారీ యాక్ష‌న్ చిత్రంతో ప్ర‌యోగం చేస్తున్నాడు. సాహో దాదాపు 400కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఈ నేప‌థ్యంలో త‌దుప‌రి న‌టించే 20వ‌ సినిమా విష‌యంలో డార్లింగ్ చాలా ఆచితూచి అడుగులేస్తున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది.

జిల్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలోని ల్యాండ్ మార్క్ ప్రాజెక్టును ఇదివ‌ర‌కూ ప్రారంభించేశాడు. పూజా హెగ్డే ఈ చిత్రంఓల నాయిక‌. ఈనెల 20 నుంచి రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌కు వెళుతున్నారన్న ప్ర‌క‌ట‌న‌తో పూజాలో టెన్ష‌న్ మొద‌లైందిట‌. ఈ సినిమా కోసం ఇండ‌స్ట్రీ బెస్ట్ టెక్నీషియ‌న్లను బ‌రిలో దించుతున్నారు. జాతీయ అవార్డు గ్ర‌హీత అమిత్ త్రివేది సంగీతం అందిస్తుండ‌గా, శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్ ఎడిటింగ్ చేయ‌నున్నారు. ఏమాయ చేశావే ఫేం మ‌నోజ్ ప‌ర‌మ‌హంస ఛాయాగ్రాహ‌కుడిగా ప‌ని చేయ‌నున్నారుట‌. ఇటలీలో రెగ్యుల‌ర్ షూట్ ప్రారంభం అవుతుంద‌ని తెలుస్తోంది. మ‌రోవైపు ఈ చిత్రం ప్రారంభం కావ‌డంతో పూజా హెగ్డే షెడ్యూల్స్ మ‌రింత హెక్టిక్ కానున్నాయ‌ని తెలుస్తోంది. ఈ అమ్మ‌డు ఓవైపు ఎన్టీఆర్ అర‌వింద స‌మేత‌, మ‌రోవైపు మ‌హేష్ మ‌హ‌ర్షి చిత్రాల‌తో బిజీగా ఉంది. బాలీవుడ్‌లో హౌస్‌ఫుల్ 4 ఫుల్ స్వింగులో ఉంది. ఆ మూడు సినిమాల‌తో పాటు ఇప్పుడు ప్ర‌భాస్ కోసం జంప్ చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చిందిట‌.

User Comments