పూజాకుమార్ పై మ‌ర్డ‌ర్ అటెంప్ట్

Last Updated on by

పూజాకుమార్.. ఈ పేరు గుర్తుందా..? ఒక్క‌సారి విశ్వ‌రూపం సినిమా గుర్తు చేసుకోండి. అందులో క‌మ‌ల్ తో పాటు న‌టించిన ముద్దుగుమ్మ గుర్తింది క‌దా..! అంతెందుకు గ‌తేడాది రాజ‌శేఖ‌ర్ గరుడ‌వేగ‌లో న‌టించింది క‌దా.. ఆ భామే పూజాకుమార్. వ‌య‌సు 40 కి చేరువ‌లో ఉన్నా కూడా ఇప్ప‌టికీ కుర్ర హీరోయిన్లకు ధీటుగా అందాలు ఆర‌బోస్తుంటుంది ఈ భామ‌. ఇప్పుడు ఈ భామ‌పై ఒక‌రు మ‌ర్డ‌ర్ అటెంప్ట్ చేసారు. చంపాల‌ని చూస్తున్నారు. ఈ విష‌యాన్ని తానే స్వ‌యంగా ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసింది కూడా. అయితే సినిమా వాళ్లు ఏం చేసినా కూడా చిన్న ట్విస్ట్ అయితే ఉంటుంది క‌దా..! పూజాకుమార్ చేసిన ప‌నిలోనూ చిన్న ట్విస్ట్ ఉంది. ఈ భామ‌ను చంప‌డానికి వ‌స్తున్న‌ది నిజం.. కానీ అది నిజం కాదు. అంతా భ్ర‌మ‌లోనే. ఈ మ‌ధ్యే ఓ మ్యూజియంకు వెళ్లింది ఈ ముద్దుగుమ్మ‌. అక్క‌డ ఓ జాంబి స్టాచ్యూ ద‌గ్గ‌ర నిల‌బ‌డింది.

Pooja Kumar Busy Schedule for Vishwaroopam 2 Special Effects

ఆ బొమ్మ చేతులు ఉన్న దగ్గ‌రే త‌న మెడ‌ను పెట్టింది ఈ భామ‌. ఆ చేతులు త‌న మెడ‌ను పిసికేస్తున్న‌ట్లుగా ఫోటో దిగి పోస్ట్ చేసింది పూజాకుమార్. విశ్వ‌రూపం, ఉత్త‌మ విల‌న్ లాంటి సినిమాల‌కు సౌండ్ ఇంజ‌నీర్ గా ప‌నిచేసిన కునాల్ రాజ‌న్ ఆహ్వానించిన ఈవెంట్ లోనే ఇదంతా జ‌రిగింది. అక్క‌డే ఉన్న బొమ్మ‌తో ఫోటో దిగి ప్రేక్ష‌కుల‌తో పాటు అంద‌ర్నీ ఆట‌ప‌ట్టించింది పూజాకుమార్. ప్ర‌స్తుతం ఈమె విశ్వ‌రూపం 2 సినిమాలో క‌మ‌ల్ తో క‌లిసి న‌టిస్తుంది. రెండేళ్లుగా ఆగిన ఈ సినిమా ఈ మ‌ధ్యే తిరిగి షూటింగ్ పూర్తి చేసుకునే ప‌నిలో బిజీగా ఉంది. ఇదే ఏడాది సినిమా విడుద‌ల‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మొత్తానికి.. పూజా కుమార్ కు క‌మ‌ల్ మ‌రోసారి బ్రేక్ ఇస్తాడో లేదో..?

Pooja Kumar Busy Schedule for Vishwaroopam 2 Special Effects

User Comments