పూన‌మ్ ఫిర్యాదు..వాళ్ల‌ గుండెళ్లో రైళ్లు!

న‌టి పూన‌మ్ కౌర్ బుధ‌వారం 36 యూ ట్యూబ్ ఛాన‌ళ్ల‌పై హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ లో ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. పూనంపై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తూ క‌థ‌నాలు వేసాయ‌ని, వ్య‌క్తిగ‌తంగా త‌న‌ను ఎంతో బాధించార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని నిందిస్తూ ఫేక్ వీడియోలు చూసి యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసార‌ని ఆరోపించింది. ఇందులో రాజ‌కీయ‌ణ కోణ‌ముంద‌ని, ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల తామె ఏం సాధిస్తారో తెలియాదంటూ వాపోయింది. రెండేళ్ల‌గా ఇలాంటి ఇబ్బందుల‌కు గుర‌వుతున్నాని, అయినా యూ ట్యూబ్ ఛాన‌ల్స్ న‌న్ను వ‌దిలిపెట్ట‌లేద‌ని విచారం వ్య‌క్తం చేసింది.

ఈ ఆరోప‌ణ‌ల‌పై సైబ‌ర్ క్రైమ్ వింగ్ అడిష‌న‌ల్ డిప్యూటీ క‌మీష‌న‌ర్ ర‌ఘువీర్ పూన‌మ్ ఫిర్యాదును స్వీక‌రించామ‌ని, ఆఛాన‌ల్ అన్నింటిపై కేసు ఫైల్ చేసామ‌ని నిజా నిజాలు నిగ్లు తేల్చుతామ‌ని తాజాగా తెలిపారు. దీంతో ఆ యూట్యూబ్ ఛాన‌ళ్ల‌పై సైబ‌ర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ ఎంత సీరియ‌స్ గా ఉందో అర్ధ‌మ‌వుతోంది. ఈ ఫేక్ క‌థ‌నాల‌ను ప‌వ‌న్ అభిమానులు చేసారా? లేక ప్ర‌త్య‌ర్ధి పార్టీలు చేసాయా? అన్న కోణంలో ప్ర‌ధానంగా విచార‌ణ చేప‌ట్ట‌నున్నార‌ని తెలుస్తోంది. ఇటీవ‌లే ష‌ర్మిల‌పై త‌ప్పుడు వార్త‌లు రాసిన వాళ్ల‌ను పోలీసుల‌కు జైలు పాలు చేసారు. దీంతో యూ ట్యూబ్ ఛాన‌ళ్ల యాజ‌మాన్యాల గుండెళ్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి.