తెలుగ‌మ్మాయ్‌ త‌లుపు త‌ట్టాడు

Last Updated on by

చికాగో రాకెట్ కేసు తెలుగ‌మ్మాయిల్ని, మ‌న క‌థానాయిక‌ల్ని అస్స‌లు వ‌దిలిపెట్ట‌డం లేదు. ఈ కేసులో అమెరిక‌న్ ఫెడ‌ర‌ల్ పోలీస్ లోతైన ద‌ర్యాప్తు సాగించ‌డంతో ఇందులో దిగిపోయిన నాయిక‌ల గుట్టు మ‌ట్లు అన్నీ లీక‌వుతున్నాయి. ఒక్కో క‌థానాయిక క‌వరింగ్ కోసం నానా తంటాలు ప‌డుతున్నార‌ని ప‌లు వెబ్‌సైట్లు పేర్కొన్నాయి.

ఇక‌పోతే ఈ కేసుతో అస‌లు పూన‌మ్ కౌర్‌కి ఉన్న సంబంధం ఏంటి? అని ఆరాతీస్తే .. కిష‌న్‌- చంద్ర‌క‌ళ దంప‌తుల వ‌ల్ల త‌న‌కు కూడా ఇబ్బందులు ఎదుర‌య్యాయ‌ని తెలిపింది. పోలీసుల‌కు చిక్కిన‌ కిషన్- చంద్రక‌ళ అస‌లు భార్యాభర్తలు కానే కాద‌న్న నిగూఢ ర‌హ‌స్యాన్ని పూన‌మ్ లీక్ చేశారు. ఆ ఇద్ద‌రూ లగ్జరీ లైఫ్ కోసం అలా నటిస్తున్నారంటూ కామెంట్ చేసింది. ఒకానొక వేళ‌ తాను అమెరికా వెళ్ళినప్పుడు బస చేసిన ఓ హోటల్ స‌మీపంలో కిషన్, చంద్ర లతో కలిసి ఓ వ్యక్తి వచ్చాడని .. అతను అర్ధరాత్రి తలుపు తట్టి విచిత్రంగా ప్రవర్తించాడని చెప్పింది. స‌ద‌రు అప‌రిచితుడి తీరుతో కోపం వచ్చి చెంప పగులగొట్టానని పూన‌మ్ చెప్ప‌డం విశేషం. డ‌బ్బాశ చూపి లేదా భ‌య‌పెట్టి అమ్మాయిల్ని లొంగ‌దీసుకునే గ్యాంగ్‌లు అమెరికాలో తిష్ట వేసి ఉన్నాయ‌ని పూన‌మ్ ఓ భ‌యాన‌క నిజాన్ని నిజాయితీగా వెల్ల‌డించారు.

User Comments