యుఎస్‌ లో క‌మెడియ‌న్ యాక్సిడెంట్‌

Last Updated on by

క‌మెడియ‌న్ ర‌ఘు కారుమంచి అమెరికాలో పెను ప్ర‌మాదం నుంచి తృటిలో త‌ప్పించుకున్నారు. అమెరికా-వ‌ర్జీనియాలో భారీ కార్ యాక్సిడెంట్ నుంచి అత‌డు ప్రాణాల‌తో బ‌తికి బ‌య‌ట‌ప‌డ‌డం ఫిలింవ‌ర్గాల్ని కంగారు పెట్టింది. మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌ల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన ర‌ఘు అక్క‌డ వ‌ర్జీనియా న‌గ‌రంలోని హైవేలో హైస్పీడ్‌తో కార్ డ్రైవ్ చేశాడు. అయితే ఆ స్పీడ్‌లో అదుపుత‌ప్పిన కార్ వేగంగా వెళుతూ డివైడ‌ర్‌ని ఢీకొట్టింది. అదృష్ట‌వ‌శాత్తూ ర‌ఘు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డినా కార్ మాత్రం నుజ్జు నుజ్జు అయ్యిందిట‌.
టాలీవుడ్‌లో దాదాపు 150 పైగా చిత్రాల్లో న‌టించిన ర‌ఘు ఎన్టీఆర్ అదుర్స్ చిత్రంతో ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టాడు. ఇటీవ‌ల గబ్బ‌ర్‌సింగ్‌లోనూ అత‌డు పండించిన కామెడీ హైలైట్ అయ్యింది. ఇండ‌స్ట్రీలో టాప్ హీరోల సినిమాల‌న్నిటా క‌మెడియ‌న్‌గా అత‌డు హైలైట్ సీన్స్‌లో న‌టించాడు. ప‌ది వేళ్ల‌కు ద‌శావ‌తారాల్లా బంగారం ఉంగ‌రాలు ధ‌రించి, మెడ‌నిండా రెండు కేజీల న‌గ‌లు ధ‌రించే క‌మెడియ‌న్ ఎవ‌రైనా ఉన్నారు అంటే అది కారుమంచి ర‌ఘు. ఇంత బ‌రువు ఎలా మోస్తున్నావు భ‌య్యా? అని అడిగితే సింపుల్‌గా న‌వ్వేస్తూ.. అవ‌కాశాల్లేక‌పోతే ఇవేగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి అనేస్తాడు!! ర‌ఘు ఈ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు అని తెలుసుకున్న సాటి న‌టీన‌టులు ఊపిరి పీల్చుకున్నారు. ప్ర‌స్తుతం అత‌డు మా సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌ల్లో ఓ ట్రూప్‌తో క‌లిసి స్కిట్‌ల్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంది.

User Comments