లంబు గాడు .. జంబుగాడు .. ఇద్దరూ 420 గాళ్లే. రియల్ ఎస్టేట్ చేస్తారు. స్టేట్నే అల్లాడిస్తారు. వీళ్లు చేసే మోసాలకు హద్దు అన్నదే లేదు. అయితే ఎవడైనా మోసం చేస్తే కోపం తన్నుకొస్తుంది. కానీ వీళ్లు చేసే మోసాలకు తెగ నవ్వొస్తుంది. కడుపుబ్బా నవ్వేసుకుంటారు… ఇదీ `దేశముదుర్స్` సినిమా పంచే వినోదం. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు ముగింపులో ఉన్న ఈ సినిమా మేలో రిలీజవుతోంది.
ఈ సందర్భంగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో దర్వకనిర్మాతలు కన్మణి, కుమార్ మాట్లాడుతూ-“పోసాని, పృథ్వీ ఫుల్ లెంగ్త్ కామెడీ పాత్రల్లో కనిపిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతో పుట్టిన సినిమా ఇది. వాళ్లిద్దరి తెరపై కాసేపు కనిపిస్తేనే? నవ్వుకుంటాం. అలాంటిది సినిమా అంతా నవ్విస్తే ఇంకేస్తాయిలో నవ్వులు పువ్వులు పుస్తాయో అన్నదే బేసిక్ థాట్. కథలో హారర్ టచ్ ఆకట్టుకుంటుంది. వీళ్లతో పాటు అర్జున్ ఎమోషనల్ రోల్ కంట తడి పెట్టిస్తుంది. మే లో సినిమా విడుదల చేస్తాం` అని తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్ ల్లో కొహ్లీ-ధోనీ కలిసి ఆడితే ఎలాంటి కిక్కుంటుందో? పోసాని, పృథ్వీ కలిసి నటిస్తే అలాంటి కిక్ దొరుకుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లా నటించిన ఆ ఇద్దరూ కడుపుబ్బా నవ్విస్తారు. హాట్ సమ్మర్లో కూల్ మూవీ ఇదని రచయిత భవానీ ప్రసాద్ తెలిపారు. 30 ఇయర్స్ పృథ్వీ, 40 ఇయర్స్ పోసాని కలిసి నటిస్తున్న సినిమాగా ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. వీళ్ల కామెడీ క్లిక్కయితే ఇది ఫుల్ సేఫ్ ప్రాజెక్టు అవ్వడం ఖాయమని ట్రేడ్లో టాక్ నడుస్తోంది. ఇంతకీ ఈ ఫోటోలో రాజాధిరాజా గెటప్స్ ఎవరిని మోసం చేయడానికి చెప్మా?