ప‌వ‌న్ ఏ ఎండ‌కు ఆ గొడుగు..

Last Updated on by

అవును.. ఇప్పుడు ప‌వ‌న్ చేస్తున్న‌ది ఇదే. ఈయ‌న ఏ ఎండుకు ఆ గొడుగు ప‌డుతున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం చేస్తూనే ఉన్నాడు. ఇప్ప‌ట్లో దేనిపై నుంచి కూడా కాలు తీసేలా క‌నిపించ‌ట్లేదు. దాంతో ప‌వ‌న్ ఇప్పుడు రెండు మార్గాల‌ను ఎంచుకుంటున్నాడు. సాధార‌ణంగా పొలిటిక‌ల్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే ఆ క్యాస్ట్యూమ్ వేరుగా ఉంటుంది. ఎప్పుడూ తెల్ల‌దుస్తుల్లోనే క‌నిపిస్తుంటాడు ప‌వ‌ర్ స్టార్. చాలా రోజులుగా ప‌వ‌న్ అంటే మ‌న‌కు గుర్తొచ్చే గెట‌ప్ కూడా ఇదే. కానీ స‌డ‌న్ గా ఆయ‌న మ‌ళ్ళీ హీరోగా మారిపోయాడు. త‌న‌లో ఇంకా ఆ స్టైల్ త‌గ్గ‌లేద‌ని.. న‌ట‌న‌కు మాత్ర‌మే తాను దూరమ‌య్యాను కానీ గ్లామ‌ర్ కు కాద‌ని మ‌రోసారి నిరూపించాడు ప‌వ‌ర్ స్టార్.

తాజాగా ఛ‌ల్ మోహ‌న్ రంగా ప్రీ రిలీజ్ వేడుక‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ను చూసి ఫిదా అయ్యారంతా. నీట్ గా ఇన్ ష‌ర్ట్ చేసుకుని వ‌చ్చిన ప‌వ‌న్ ను చూసి అభిమానులు ఖుషీ అయిపోయారు. దానికితోడు న‌వ్వుతూ మాట్లాడి ఫ్యాన్స్ ను మ‌రింత ఖుషీ చేయించాడు ప‌వ‌ర్ స్టార్. ఎన్ని చేసినా తాను మాత్రం సినిమాల‌కు దూరంగానే ఉంటాన‌ని మ‌రోసారి చెప్పాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. అక్క‌డ్నుంచి వ‌చ్చిన నెక్ట్ సెకండ్ లోనే మ‌ళ్లీ తెల్ల దుస్తుల్లోకి మారిపోయి మ‌ళ్లీ రాజ‌కీయ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అయిపోయాడు. ఈ మ‌ధ్యే సిపిఎం లీడ‌ర్స్ తో జ‌న‌సేన పార్టీ ముచ్చ‌ట్లు మాట్లాడాడు ప‌వ‌ర్ స్టార్. మొత్తానికి ప‌వ‌న్ రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం ఎంత‌వ‌ర‌కు సాగుతుందో..!

User Comments