ప్ర‌భాస్ ఫాంట‌సీ యాక్ష‌న్‌

Last Updated on by

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఎవ‌రూ చేయ‌ని రీతిలో ప్ర‌యోగాలు చేస్తున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. బాహుబ‌లి సిరీస్ త‌ర‌వాత అత‌డి స్థాయి అమాంతం యూనిర్శ‌ల్ ఆడియెన్‌ని తాకింది. దాంతో అందుకు త‌గ్గ‌ట్టే క‌థాంశాల్ని ఎంచుకుని భారీ ప్ర‌యోగాల‌కే సిద్ధ‌మ‌య్యాడు. ఆ క్ర‌మంలోనే `సాహో` వంటి భారీ బ‌డ్జెట్ చిత్రంలో న‌టిస్తున్నాడు. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియేష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోంది.

ఇక‌పోతే ఈ సినిమా సెట్స్‌లో ఉండ‌గానే జిల్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలోని సినిమాని ప‌ట్టాలెక్కించ‌నున్నారు. ఆగ‌ష్టులో ఈ సినిమా ప్రారంభం కానుంది. 1970 కాలంలో సాగే ఫాంట‌సీ చిత్ర‌మిద‌ని చెబుతున్నారు. ఈ సినిమాలో చారిత్ర‌క అంశాల‌తో పాటు, ఫాంట‌సీకి అత్యంత ప్రాధాన్య‌త ఉంటుంద‌ని తెలుస్తోంది. క‌ళాద‌ర్శ‌కుడు ర‌వీంద‌ర్ ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లో భారీ సెట్ నిర్మిస్తున్నారు. ఈ సెట్‌లో చిత్రీక‌ర‌ణ‌తో పాటు యూర‌ప్‌లో మెజారిటీ పార్ట్ తెర‌కెక్కిస్తార‌ని తెలుస్తోంది. ప్ర‌భాస్ 20లో ఫాంట‌సీ, ల‌వ్‌, యాక్ష‌న్ హైలైట్‌గా ఉంటాయ‌ని చెబుతున్నారు. ప్ర‌భాస్ 20 చిత్రాన్ని యు.వి.క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది.

User Comments