ప్ర‌భాస్-20 టైటిల్ `జాన్`

Last Updated on by

టైటిల్‌తోనే స‌గం బ‌లం. టైటిల్ పెర్ఫెక్ట్ గా కుదిరితే ఆ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతాయి. ఇది ఎన్నో సినిమాల విష‌యంలో ద‌ర్శ‌క‌నిర్మాత‌ల ప్ర‌త్య‌క్ష‌ అనుభ‌వం. అందుకే టైటిల్ నిర్ణ‌యించే ముందే ఎంతో ఆలోచిస్తుంటారు. క‌థ‌కు త‌గ్గ టైటిల్ కుదిరితే అంత‌కంటే అదృష్ట‌మే ఉండ‌దు. ఇదిగో ఇప్పుడు అలాంటి ఓ గ్రేట్ టైటిల్‌ని డార్లింగ్ ప్ర‌భాస్ ల‌వ్‌స్టోరీ కోసం ఫిక్స్ చేశార‌ని తెలుస్తోంది.

ప్ర‌భాస్ 19వ చిత్రానికి `సాహో` అంటూ భారీ యాక్ష‌న్ కి త‌గ్గ‌ట్టే టైటిల్‌ని ఫిక్స్ చేసింది యు.వి.క్రియేషన్స్ సంస్థ‌. ఇప్పుడు డార్లింగ్ న‌టిస్తున్న కెరీర్ 20వ సినిమా పూర్తిగా ప్రేమ‌క‌థా చిత్రం. అమ్మాయి వెంట‌ప‌డే పిచ్చి ప్రేమికుడి క‌థ‌తో తెర‌కెక్కుతోంది. యూర‌ప్ బ్యాక్‌డ్రాప్ లో అద్భుత‌మైన పీరియాడిక్ ల‌వ్‌స్టోరి ఇద‌ని చెబుతున్నారు. అందుకు త‌గ్గ టైటిల్‌ని గోపికృష్ణ మూవీస్ రిజిష్ట‌ర్ చేయించిందిట‌. ఇంత‌కీ టైటిల్ ఏంటి? అంటే `జాన్‌` అని తెలిసింది. ఈ టైటిల్‌ని బ‌ట్టి మేరా జాన్ ల‌వ్ యు! అంటూ మ‌న డార్లింగ్ … పూజా హెగ్డే వెంట ప‌డ‌తాడ‌న్న‌మాట‌. జాన్ అన్న సౌండింగ్ ఇంట్రెస్టింగ్‌. ప్రేమ‌క‌థ‌కు సింబాలిక్‌గానూ ఉంది. ఈ క్రేజీ మూవీకి జాతీయ అవార్డ్ గ్ర‌హీత, `సైరా-న‌ర‌సింహారెడ్డి` ఫేం అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. శ్రీ‌క‌ర్ ప్రసాద్ ఎడిటర్ కాగా, రేసుగుర్రం, ఏ మాయ చేశావే చిత్రాల ఛాయాగ్రాహ‌కుడు మ‌నోజ్ ప‌ర‌మ‌హంస ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు.

User Comments