ప్ర‌భాస్‌- మైత్రి పాన్ ఇండియా ప్లాన్

డార్లింగ్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా జాన్ ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న సంగ‌తి తెలిసిందే. జిల్ రాధాకృష్ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గోపికృష్ణ మూవీస్- యువి క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించే 21వ సినిమా ఏ బ్యాన‌ర్ లో ఉంటుంది? అన్న‌దానికి స‌రైన ఆన్స‌ర్ లేదు.

ప్ర‌భాస్ బాలీవుడ్ సినిమా ధూమ్ 4లో న‌టిస్తార‌ని ఇంత‌కుముందు ప్రచార‌మైంది. అయితే ప్ర‌భాస్ కి సంబంధించిన‌ వేరొక కమిట్ మెంట్ గురించి తాజాగా ఆస‌క్తిక‌ర స‌మాచారం రివీలైంది. ప్ర‌ఖ్యాత మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ ఇంత‌కుముందు ప్ర‌భాస్ కి రూ.5కోట్ల మేర అడ్వాన్స్ ఇచ్చింద‌ట‌.  తాజాగా మ‌రో 8 కోట్లు అద‌నంగా ప్ర‌భాస్ కి ఇచ్చింద‌ని తెలుస్తోంది. అంటే మొత్తం 13కోట్ల మేర ప్ర‌భాస్ కి మైత్రి సంస్థ అడ్వాన్స్ ఇచ్చింది. అంతేకాదు.. ప్ర‌భాస్ తో మైత్రి సంస్థ ఓ భారీ పాన్ ఇండియా సినిమాని నిర్మించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉంద‌ని తెలుస్తోంది. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అన్న‌ది ఇంకా రివీల్ కాలేదు. ప్ర‌భాస్ ప్ర‌స్తుత క‌మిట్ మెంట్లు పూర్తయితే త‌దుప‌రి మైత్రితో సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని చెబుతున్నారు.