సుప్రీమ్ హీరో కోసం డార్లింగ్ బ‌రిలో

Prabhas Gracing Prati Roju Pandaage Pre release event
సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ క‌థానాయ‌కుడిగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `ప్ర‌తి రోజూ పండ‌గే` డిసెంబ‌ర్ 20న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగ‌తి  తెలిసిందే. ఇప్ప‌టికే పెద్ద ఎత్తున సినిమాని ప్ర‌జ‌ల‌కు ముందుకు తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. సాయిధ‌ర‌మ్ తేజ్- మారుతి  నేరుగా అభిమానుల ముందుకెళ్లి మ‌రీ సినిమాని ప్ర‌మోట్ చేసారు. ఇటీవ‌లే దాదాపు కోస్తా జిల్లాల‌న్నింటిని చుట్టేసారు. తాజాగా ఈనెల 15న జ‌రిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్టార్ హీరో ప్ర‌భాస్ నే బ‌రిలోకి దింపుతున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌భాస్ ముఖ్య అతిధిగా వేడుకును అభిమానుల స‌మ‌క్షంలో గ్రాండ్ గా నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు సాగుతున్నాయి.

సాయితేజ్-ప్ర‌భాస్ ఇద్ద‌రూ మంచి స్నేహితులు. మెగా మేన‌ల్లుడి కుటుంబంతో ప్ర‌భాస్ కు మంచి సాన్నిహిత్యం  ఉంది.  చిత్ర నిర్మాత‌ల‌లో ఒక‌రుగా కొన‌సాగుతోన్న యువి క్రియేష‌న్స్ అధినేత‌లు వంశీ, ప్ర‌మోద్ లు తోనూ స్నేహానుబంధం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. యు.వి క్రియేష‌న్స్ అంటే ప్ర‌భాస్ సొంతిల్లు లాంటిది. ఆ బ్యాన‌ర్  ఏ సినిమా రిలీజ్ చేసినా అవ‌స‌రాన్ని బ‌ట్టి ఆ చిత్రాన్ని ప్ర‌మోట్ చేస్తుంటాడు.  సాయితేజ్ వ్య‌క్తిగ‌తంగాను మంచి స్నేహితుడు కావ‌డంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డార్లింగ్ త‌ప్ప‌క హాజ‌ర‌వుతాడ‌ని తెలుస్తోంది.