తాప్సి ఫంక్షన్ కి ప్రభాస్ చీఫ్ గెస్ట్ అంట..!

బాహుబలితో నేషనల్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్ ప్రస్తుతం ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే తన కొత్త సినిమా సాహో కోసం కష్టపడుతున్న విషయం అందరికీ తెలుసు. ఈ క్రమంలో అప్పుడప్పుడూ మాత్రమే బయట సింపుల్ గా కనిపిస్తోన్న ప్రభాస్ ఎక్కువగా ఫ్యామిలీతోనూ, ఫ్రెండ్స్ తోనూ టైమ్ స్పెండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పుడు ఓ హీరోయిన్ కోరిక మేరకు ఓ ఫంక్షన్ కు ప్రభాస్ తన స్టైల్లో చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడని తెలియడం ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది.

ఆ స్టోరీలోకి వెళితే, టాలీవుడ్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొని ఇప్పుడు టాలీవుడ్ లోనే తాప్సి కీలక పాత్రలో నటించిన ‘ఆనందో బ్రహ్మ’ సినిమా రిలీజ్ కు రెడీ అయిన విషయం తెలిసే ఉంటుంది. ఈ నెల 18నే రిలీజ్ కాబోతున్న ఈ కామెడీ హారర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఇప్పుడు ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నాడని టాక్ బలంగా వినిపిస్తుంది. ఈ మేరకు ఆగష్టు 14న పార్క్ హయత్ లో జరగనున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నాడని దర్శక నిర్మాతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక ఈ సినిమాలో తాప్సితో పాటు మరో నలుగురు కమెడియన్లు కీలక పాత్రలో నటించడంతో.. ప్రభాస్ రాకతో ఫంక్షన్ కూడా అదిరిపోతుందని అంటున్నారు. ఇదే సమయంలో ఫ్రెండ్ లాంటి హీరోయిన్ తాప్సి కోరిక మేరకే ప్రభాస్ ఈ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడని చెబుతున్నారు. మొత్తంగా మొన్నటివరకు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తోన్న ప్రభాస్ ఇప్పుడు ఈ ఫంక్షన్ కు వస్తున్నాడంటే ఫ్యాన్స్ కు పండుగే. ముఖ్యంగా ప్రభాస్ న్యూ లుక్ ఎలా ఉండబోతుందో ఇటు ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాలకు కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు, ప్రభాస్ పెళ్ళికి కూడా రెడీ అయిపోతున్నాడని వార్తలు హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో.. ఈ ఫంక్షన్ తో మరోసారి ప్రభాస్ మీడియాలో హైలైట్ అయ్యేలా కనిపిస్తున్నాడు.