ఎట్టకేలకు ప్రభాస్ చెప్పేశాడు

Prabhas Clarity Marriage
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఎవరు అంటే ఖచ్చితంగా ప్రభాస్ అనే చెప్తాము.  రాజమౌళి సినిమాకు కమిట్ అయ్యి ఐదు సంవత్సరాల పాటు ఆ సినిమా మీద కూర్చున్నాడు.  ప్రభాస్ ఏజ్ ఉన్న హీరోలు ఇప్పటికే చాలామంది పెళ్లి చేసుకొని సినిమాల్లో నటిస్తుంటే ప్రభాస్ మాత్రం పెళ్ళికి ఇంకా సమయం ఉందని గతంలో చెప్పుకొచ్చాడు.  బాహుబలి సినిమా తరువాత చేసుకుంటా అన్నాడు.  ఇక, ప్రభాస్ తో బిల్లా సినిమాలో చేసిన అనుష్క ఆ తరువాత మిర్చి, బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాల్లో నటించింది. వరసగా ప్రభాస్ తో కలిసి నటిస్తుండటంతో.. వారిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉందని కొందరు.. ఇద్దరు ప్రేమలో పడ్డారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వచ్చాయి.
అయితే, ఈ వార్తల్ని ప్రభాస్ ఖండించకపోవడంతో.. రూమర్లు ఎక్కువయ్యాయి.  పెళ్లి త్వరలోనే అంటే ప్రచారం కూడా జరిగింది.  ఇక, ప్రభాస్ ఇంట్లో కొన్ని సంబంధాలు చూస్తున్నారని.. ఎవరో ఒకమ్మాయి ఫోటో కూడా మీడియా లో ప్రచారం జరిగింది.  ఆ అమ్మాయే ప్రభాస్ కు కాబోయే వధువు అంటూ వార్తలు వినిపించాయి.  అది నిజం కాదు. వరసగా ప్రభాస్ పై ఇలాంటి రూమర్లు వస్తుండటంతో.. ఎట్టకేలకు ప్రభాస్ నోరు విప్పాడు. ప్రస్తుతం తన దృష్టి సాహో సినిమాపైనే ఉందని.. అనుష్కతో పెళ్లి అనేది జస్ట్ రూమర్ మాత్రమేనని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని, సాహో తర్వాత పెళ్లి పీటలెక్కే అవకాశాలు ఉండొచ్చని చెప్పకనే చెప్పేశాడు. అలాగే పెళ్లి ఫిక్స్ అయితే మీడియా తో తప్పకుండా చెప్తానని అన్నాడు ప్రభాస్.  మరి ఆ వార్త ఎప్పుడు చెప్తాడో.. ఎప్పుడు వింటామో.  చూద్దాం.