షాకింగ్: సాహోలో ప్ర‌భాస్ డ‌బుల్ యాక్ష‌న్

ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో యూవీ క్రియేష‌న్స్ నిర్మించిన సాహో రిలీజ్ కు ఇంకా ఐదు రోజులే స‌మ‌యం ఉంది. ఇప్ప‌టికే బిజినెస్ లెక్క‌లు చూస్తుంటే సాహో టార్గెట్ భారీగానే ఉంద‌ని అర్ధ‌మ‌వుతోంది. అంతే అంచ‌నాల‌తోనూ రిలీజ్ అవుతోంది. అయితే తాజాగా ఓ షాకింగ్ రూమ‌ర్ సోష‌ల్ మీడియాను ఊపేస్తోంది. ఇందులో ప్ర‌భాస్ ద్విపాత్రాభిన‌యం పోషిస్తున్నాడు! అన్న వార్త జోరుగా ట్రెండింగ్ లో ఉంది. యూనిట్ కేవ‌లం ఒక రోల్ మాత్ర‌మే రిలీల్ చేసి మ‌రో పాత్ర‌ను సీక్రెట్ గా ఉంచింద‌ని సినిమాలో మాత్రం రివీల్ కానుంద‌ని అంటున్నారు.

ఇంకొంత మంది ఆ రోల్ నెగిటివ్ అని మాట్లాడుకుంటున్నారు. ప్ర‌స్తుతం తెలుగు ప్రేక్ష‌కుల ఆలోచ‌నా విధానం మారిన నేప‌త్యంలో ధైర్యంగా సుజిత్ రెండ‌వ రోల్ ను ప‌రిచ‌యం చేస్తున్నాడ‌ని వినిపిస్తోంది. ఇందులో నిజ‌మెంత‌న్న ది తెలియ‌దు గానీ! అదే జ‌రిగితే అభిమానుల‌కు పెద్ద పండ‌గే. భారీ క‌టౌట్ ను హీరోగా, విల‌న్ గా చూసుకునే అదృష్టం ద‌క్కిన‌ట్లే. ఇలాంటి ఫీట్ ఇప్ప‌టివ‌ర‌కూ ఏ స్టార్ హీరో చేయ‌లేదు. అయితే ఈ రూమ‌ర్ల‌పై యూనిట్ ఇప్ప‌టివ‌ర‌కూ స్పందించ‌లేదు.