ప్ర‌భాస్ అతిధిగృహం సీజ్

Last Updated on by

డార్లింగ్ ప్ర‌భాస్‌కి టీ-గ‌వ‌ర్న‌మెంట్ పెద్ద షాకివ్వ‌డం ఫిలింన‌గ‌ర్‌లో వాడి వేడి చ‌ర్చ‌కు తెర‌తీసింది. గత కొన్నేళ్లుగా కోర్టు వివాదంలో ఉన్న ఆ స్థ‌లంలో డార్లింగ్ ఫామ్‌హౌస్ ఉండ‌డంతో దానిని రెవెన్యూ అధికారులు సీజ్ చేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది. వివాదం వివ‌రాల్లోకి వెళితే..

రాయ‌దుర్గం గ్రామ రెవెన్యూ ప‌రిధిలో.. స‌ర్వే నంబ‌రు 46లో 84 ఎక‌రాల 30 గుంట‌ల భూమికి సంబంధించి 40 ఏళ్లుగా కోర్టు కేసు న‌డుస్తోంది. ఈ స్థ‌లం కొంద‌రు ప్ర‌యివేటు వ్య‌క్తుల‌కు చెందుతుంద‌ని ఇదివ‌ర‌కూ మాల రాములు, నీరుడు ల‌క్ష్మ‌య్య అనే ఇద్ద‌రు కోర్ట‌కు వెళ్లారు. ఆ ఇద్ద‌రికీ అనుకూలంగా ధ‌ర్మాస‌నం తీర్పును వెలువ‌రించింది. అయితే అప్ప‌ట్లో త‌హ‌శీల్దారు ఆ ప‌నిని స‌వ్యంగా చేయ‌క‌పోవ‌డంతో మ‌రోసారి శివ‌రామ‌కృష్ణ అనే వ్య‌క్తి న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు. కానీ దానికి ఎదురు తిరిగిన త‌హ‌శీల్దారు మ‌రో కోర్టుకు వెళ్లి బ‌లంగా వాదించ‌డంతో చివ‌రికి అది ప్ర‌భుత్వ స్థ‌ల‌మేన‌ని కోర్టు తీర్పును వెలువ‌రించింది. అలా చివ‌రికి ఆ భూమి ప్ర‌యివేటు వ్య‌క్తుల‌కు చెంద‌ద‌ని, ప్ర‌భుత్వానికే చెందుతుంద‌ని చివ‌రికి తీర్పు వ‌చ్చింది. తాజాగా ఆ భూమిని సీజ్ చేయ‌డంతో అందులో ప్ర‌భాస్ ఫామ్ హౌస్‌ని సీజ్ చేయాల్సి వ‌చ్చింద‌ట‌. తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌గానే ఇదో పెద్ద జోల్ట్ అని చెబుతున్నారు. అవినీతిప‌రులు ఎంత‌టివారైనా వ‌దిలేది లేద‌ని కేసీఆర్, కేటీఆర్ వ‌ర్గాలు సీరియ‌స్‌గానే ఉన్నారు. దీంతో మునుముందు ఇలాంటి ఆక్ర‌మ‌ణ‌ల ఫ‌ర్వంపైనా పూర్తిగా గ‌న్ గురి పెడ‌తార‌నే మాట్లాడుకుంటున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ సాహో చిత్రంతో పాటు జాన్ చిత్రం షూటింగులో పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ కోర్టు గొడ‌వ ఇబ్బందిక‌ర‌మే.

User Comments