ఆ ద‌ర్శ‌కుడికి ప్ర‌భాస్ డెడ్ లైన్..

ఏ హీరోకైనా కెరీర్ లో నాలుగేళ్లు అనేది చాలా పెద్ద నెంబ‌ర్. అన్నేళ్లు బాహుబ‌లి కోసం రాసిచ్చేసాడు ప్ర‌భాస్. రాజ‌మౌళిపై ఉన్న న‌మ్మ‌కం కావ‌చ్చు.. మ‌రేదైనా కావ‌చ్చు కానీ పెళ్లి కూడా కాద‌ని బాహుబ‌లి పూర్తి చేసాడు ప్ర‌భాస్. ఈ చిత్రం త‌ర్వాత వ‌ర‌స‌గా సినిమాలు చేస్తాన‌ని మాటిచ్చాడు ప్ర‌భాస్. కానీ అన్న మాట మాత్రం నిల‌బెట్టుకోలేక‌పోతున్నాడు. 2018 ఈయ‌న కెరీర్ లో ఖాళీగానే మిగిలిపోనుంది. సాహో సినిమా ఇప్ప‌ట్లో పూర్తి కావ‌డం క‌ష్ట‌మే. క‌చ్చితంగా ఈ చిత్రం వ‌చ్చేది 2019లోనే. అయితే ఒక్క‌టి మాత్రం చేస్తున్నాడు ప్ర‌భాస్. సాహోతో పాటు మ‌రో సినిమాను కూడా వ‌చ్చే ఏడాది విడుద‌ల చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్.

సాహో సెట్స్ పై ఉండ‌గానే.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తోనూ ఓ సినిమాకు క‌మిట‌య్యాడు యంగ్ రెబ‌ల్ స్టార్. ఆయ‌న చెప్పిన క‌థ‌కు ప్లాట్ అయిపోయిన ప్ర‌భాస్.. సింగిల్ సిట్టింగ్ లోనే సినిమా ఓకే చేసాడు. ఇందులో ప్ర‌భాస్ ల‌వ‌ర్ బాయ్ గా క‌నిపించ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ క‌న్ఫ‌ర్మ్ చేసాడు. అయితే ఇక్క‌డ మ‌రో విశేషం కూడా ఉంది. ఇది పూర్తిగా 70-80వ ద‌శ‌కంలో జ‌రిగే క‌థ అని తెలుస్తోంది. ఇప్ప‌టికే రంగ‌స్థ‌లం సినిమాను 1985 నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తున్నాడు సుకుమార్. ఇప్పుడు ప్ర‌భాస్ ఇదే స్టైల్లోకి వెళ్తున్నాడా అనే అనుమానం క‌లుగుతుంది ఇప్పుడు. ఈ సినిమా కూడా 2018లో ప‌ట్టాలెక్క‌నుంది. ఈ సినిమా యువీ క్రియేష‌న్స్, గోపీకృష్ణ బ్యాన‌ర్ సంయుక్తంగా నిర్మించ‌బోతున్నారు. నాలుగంటే నాలుగే నెల‌ల్లో ఈ సినిమాను పూర్తి చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నాడు రాధాకృష్ణ కుమార్. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ అంతా చేసుకుంటున్నాడు జిల్ ద‌ర్శ‌కుడు. మొత్తానికి  ఇచ్చిన మాట ప్ర‌కారం వ‌చ్చే ఏడాది రెండు సినిమాలు చేయ‌బోతున్నాడు ఈ హీరో.