ప్రభాస్ సినిమాతో మరో యంగ్ మదర్

భాగ్యశ్రీ… ఒకప్పుడు కుర్రకారు హృదయాల్నికొల్లగొట్టిన తార. `మైనే ప్యార్ కియా` చిత్రంతో అన్ని భాషల్లోనూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే కెరీర్ ఊపుమీదున్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకి దూరమైంది. ఇప్పుడామెకి ఇరవయ్యేళ్లు పైబడిన కొడుకు కూడా ఉన్నాడంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆమె రీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. బాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన భాగ్యశ్రీ తెలుగు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండడం విశేషం.

ఆ సినిమా ఏదో కాదు… ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న `జాన్`. పీరియాడికల్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఇందులో ప్రభాస్‌కి తల్లిగా భాగ్య శ్రీ నటిస్తోందట. త్వరలోనే ఆమె టీమ్‌తో కలవబోతోందని సమాచారం. ప్రభాస్ ఇదివరకు చేసిన సినిమా `మిర్చి`లో కూడా ఆయనకి తల్లిగా నదియా నటించిన విషయం తెలిసిందే. అందులో ఆమె అందమైన యంగ్ మదర్‌గా కనిపించి అలరించింది. అలా భాగ్య శ్రీ కూడా తెరపై సందడి చేయబోతోందన్నమాట.