2020 జ‌న‌వ‌రిలో ప్ర‌భాస్ `జాన్`!

Prabhas20 jaanu

Last Updated on by

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా ఒకేసారి రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో `సాహో`తో పాటు, జిల్ ఫేం రాధాకృష్ణ‌  `జాన్` ను సెట్స్ కు తీసుకెళ్లిన‌ సంగ‌తి తెలిసిందే. ఆమ‌ధ్య ఇట‌లీలో కీల‌క షెడ్యూల్ని పూర్తి చేసారు. `సాహో` చిత్రీక‌ర‌ణ క్లైమాక్స్ చేరుకోవ‌డంతో ప్ర‌భాస్ దృష్టి అంతా కొత్త సినిమాపైనే పెట్ట‌నున్నాడు. ఇది ప్ర‌భాస్ కు 20వ సినిమా కావ‌డం తో గోపీ కృష్ణ బ్యాన‌ర్-యువి క్రియేష‌న్స్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుని తెర‌కెక్కిస్తున్నాయి. ప్ర‌భాస్ ఇమేజ్ కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా అభిమానుల‌ను దృష్టిలో పెట్టుకుని తెర‌కెక్కిస్తున్నారు. చాలా గ్యాప్ త‌ర్వాత రొమాంటిక్ జోన‌ర్ లో న‌టించ‌డంతో ప్ర‌భాస్ అంతే ఉత్స‌క‌త చూపిస్తున్నాడు. తాజాగా యూనిట్ త‌దుప‌రి భారీ షెడ్యూల్ ను హైద‌రాబాద్ లోనే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

అన్న‌పూర్ణ స్టూడియోలో పాత కాల‌పు ఇట‌లీ సృతుల‌ను త‌ల‌పించేలా ఓ సెట్ నిర్మిస్తున్నారుట‌. క‌ళా ద‌ర్శ‌కుడు ర‌వీంద‌ర్ ఆధ్వ‌ర్యంలో సెట్ నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. అతి త్వ‌ర‌లోనే యూనిట్ జాన్ సెట్స్ లో వాలిపోనున్నుట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో రిలీజ్ డేట్ కూడా లీకైంది. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుగా చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి యూనిట్ స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇందులో ప్ర‌భాస్ కు జోడీగా పూజాహెగ్దే న‌టిస్తోంది. అమిత్ త్రివేది చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇక `సాహో` ఇదే ఏడాది స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

Also Watch: Actress Rakul Preet Singh Latest Stills


Related Posts