షాక్‌: జాన్ కోసం 60 కోట్ల సెట్లు?!

Last Updated on by

Last updated on April 1st, 2019 at 03:45 pm

డార్లింగ్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా జిల్ రాధాకృష్ణ `జాన్` అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. పూజా హెగ్డే ఈ చిత్రంలో క‌థానాయిక. గోపికృష్ణ బ్యాన‌ర్ తో క‌లిసి యువి క్రియేష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోంది. 2020 సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌న్న‌ది యువి సంస్థ ప్లాన్.

ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ఎక్క‌డ సాగుతోంది? అంటే ఒక భారీ షెడ్యూల్ ని హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోస్ లో ప్లాన్ చేశార‌ని తెలిసింది. ఇప్ప‌టికే అన్న‌పూర్ణ స్టూడియోస్ లో 60 కోట్ల‌తో 18 సెట్లు నిర్మిస్తున్నార‌ట‌. మొత్తం 20 సెట్స్ నిర్మించాల్సి ఉండ‌గా, మ‌రో రెండు బ‌య‌ట ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. ఇక అన్న‌పూర్ణ స్టూడియోస్ లో ఏకంగా యూర‌ప్ వాతావ‌ర‌ణం, టెక్నాల‌జీతో రోమ్ న‌గ‌రాన్ని సెట్స్ లో ఎలివేట్ చేస్తున్నార‌ట‌. ఇవి సినిమాకే హైలైట్ గా నిలుస్తాయ‌ని చెబుతున్నారు. అంటే 60-70 కోట్ల మేర కేవ‌లం సెట్స్ కే ఖ‌ర్చు చేస్తున్నార‌ని తెలుస్తోంది.

Also Read : Tremendous Response For Majili Trailer

User Comments