ప్ర‌భాస్ వేడెక్కించే మ్యాట‌ర్‌

Last Updated on by

ఇన్నాళ్లు వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్‌.. డార్లింగ్ ప్ర‌భాస్ కోసం ఇంత‌కాలం వేచి చూడాలా? ఓరి దేవుడోయ్‌! ఏళ్ల‌కు ఏళ్లు కాల‌గ‌ర్భంలో క‌లిసిపోవ‌డ‌మే..! ఇంత‌కుముందు సుజీత్‌కి ఇదే ప‌రిస్థితి. ఇప్పుడు జిల్ రాధాకృష్ణ‌కు సేమ్ స‌న్నివేశం. అయితే ఆ వెయిటింగ్ ఫ‌లించింది. పెద్ద ప్ర‌తిఫ‌లాన్ని అందివ్వ‌బోతోంది. కెరీర్‌లో వెన‌క‌బ‌డ్డాం అన్న బెంగ లేకుండా మొత్తానికి సెట్స్‌కెళ్లిపోతున్నారు.

ఇంత‌కీ ఏమైంది? అంటే.. ప్ర‌భాస్ కోసం జిల్ రాధాకృష్ణ రెండేళ్లుగా ఎంతో ఓపిగ్గా ఎదురు చూస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆ కాంబో తెర‌కెక్కించ‌నున్న సినిమా ఆగ‌స్టు మొదటివారంలో ప్రారంభం కానుందన్న శుభ‌వార్త క్లియ‌ర్‌క‌ట్‌గా అందింది. ఇప్ప‌టికే యువి క్రియేష‌న్స్ ముహూర్తం ఫిక్స్ చేసింది. మ‌రో 15రోజుల్లోనే డార్లింగ్ కొత్త సినిమా మొద‌లైపోతోంది. ఈ సినిమా తెలుగు సినిమా హిస్ట‌రీలో మునుపెన్న‌డూ చూడ‌నంత గ్రేట్ క్లాసిక్ ల‌వ్ స్టోరితో తెర‌కెక్క‌నుంద‌ని, 1960 నేప‌థ్యంలో ఆద్యంతం ర‌క్తిక‌ట్టిస్తుంద‌ని చెబుతున్నారు. యూర‌ఫ్‌లోని ఎగ్జోటిక్ లొకేష‌న్ల‌ను కెమెరాల్లో బంధించి, అక్క‌డ అవ‌స‌రం మేర సెట్స్ వేసి చిత్రీక‌రించేందుకు టీమ్ రెడీ అవుతోంది. యు.వి.క్రియేష‌న్స్‌తో క‌లిసి ప్ర‌భాస్ సొంత బ్యాన‌ర్ గోపి కృష్ణ మూవీస్ జాయింట్ వెంచ‌ర్‌లో ఈ ప్రాజెక్టును తెర‌కెక్కిస్తోంది.

User Comments