ప్ర‌భాస్ మేక‌ప్‌మేన్ పారితోషికం?

Last Updated on by

సినిమా 24 శాఖ‌ల్లో మేక‌ప్ డిపార్ట్‌మెంట్ ప్రాధాన్య‌త విస్మ‌రించ‌లేనిది. మేక‌ప్ స‌రిగా లేక‌పోతే న‌టీన‌టులు తెర‌పై ఎలా క‌నిపిస్తారో సులువుగా ఊహించ‌గ‌లం. అయితే ఈ డిపార్ట్‌మెంట్‌లో జీతభ‌త్యాలు ఎలా ఉంటాయి? అన్న‌ది ఆరాతీస్తే ప‌లు ఆస‌క్తిక‌ర సంగుతులే తెలిశాయి. మ‌న స్టార్ హీరోల వ‌ద్ద ప‌ని చేసే మేక‌ప్‌మేన్‌కు ఒక్కో కాల్షీట్‌కి రూ.3000- రూ.8000 రేంజు ఉంటుందిట‌.

ముంబై నుంచి ఎవ‌రైనా స్పెష‌లిస్టును బ‌రిలో దించితే రోజుకు రూ.8వేలు చెల్లించాలి. విమానం టిక్కెట్లు, ఇత‌ర‌త్రా సౌక‌ర్యాలు అద‌నం. అదే లోక‌ల్ హైద‌రాబాద్ గ‌య్ అయితే రూ.5000 వ‌ర‌కూ ఇస్తున్నార‌ట‌. అదే ట‌చ‌ప్ బోయ్‌కి 3000 వ‌ర‌కూ గిట్టుబాటు అవుతుంద‌ని తెలుస్తోంది. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న‌వ‌న్నీ క్రేజీ సినిమాలే కాబ‌ట్టి ముంబై నుంచి స్పెష‌లిస్టు మేక‌ప్‌మేన్‌ని ర‌ప్పిస్తున్నారు. అలానే చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, బ‌న్ని వంటి స్టార్లు అవ‌స‌రాన్ని బ‌ట్టి ముంబై నుంచి మేక‌ప్‌మేన్‌ల‌ను పిలిపించుకుంటారు. యంగ్ య‌మ ఎన్టీఆర్ లోక‌ల్ గ‌య్‌తోనే మేకప్‌ని ప్రిఫ‌ర్ చేస్తున్నార‌ట‌. స్టార్ హీరోల‌కు ఆ రేంజులో ఉంది. ఓ మోస్త‌రు హీరోల‌కు అయితే అందులో స‌గం బ‌డ్జెట్ ఉంటే స‌రిపోతుందిట‌. ఫైన‌ల్‌గా ఈ ఛార్జీల‌న్నీ నిర్మాత అకౌంట్లోనే అన్న సంగ‌తి తెలిసిందే.

User Comments