సాహో త‌ర్వాతే పెళ్లి!

Last Updated on by

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పెళ్లెప్పుడు? ప‌దే ప‌దే అభిమానులు స‌హా మీడియా నుంచి ఎదుర‌య్యే ప్ర‌శ్న ఇది. నేడు రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అయినా ప్ర‌భాస్ పెళ్లి గురించి ఏదైనా క్లూ దొరుకుతుంద‌నే భావించారు. కానీ దీనిపై పెద‌నాన్న దాట‌వేశారు. అయితే మీడియా జ‌నం మాత్రం సాహో రిలీజ్ త‌ర్వాత ప్ర‌భాస్ పెళ్లి క‌బురు అందే ఛాన్సుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

బాహుబ‌లి రిలీజ్ త‌ర్వాత పెళ్లాడుతాన‌ని ప్ర‌భాస్ అన్నాడు. ఐదేళ్లకు బాహుబ‌లిని పూర్తి చేసినా, ఆ వెంట‌నే సాహో మొద‌లు పెట్టేయ‌డంతో పెళ్లి గురించి ఆలోచించ‌లేదు. ఈ సినిమా పేరుతో మ‌రో రెండేళ్లు కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయాయి. ఇక‌పోతే గ‌త కొంత‌కాలంగా సాహో కోసం ప్ర‌భాస్ ర‌క‌ర‌కాల హెయిర్ స్టైల్స్ ని మార్చాడు. ప్ర‌స్తుతం అత‌డు ప‌క్క పాపిడితో పొడ‌వాటి హెయిర్ ని మెయింటెయిన్ చేస్తున్నాడు. లుక్ బావుంది.. పిల్ల‌ను వెతుక్కుంటే వెంట‌నే ప‌డిపోవ‌డం ఖాయం అంటూ అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అన్నిటికీ స‌మాధానం ఆగ‌స్టు త‌ర్వాత‌నే ఉంటుందేమో!

User Comments