వార్‌` ద‌ర్శ‌కుడితో ప్ర‌భాస్‌?

ప్ర‌భాస్ కోసం నిజంగా ఎంత‌మంది ద‌ర్శ‌కులు క‌థ‌లు సిద్ధం చేసుకున్నారో.. ఆయన ఎంత మంది చెప్పిన క‌థ‌లు విన్నారో తెలియ‌దు కానీ, రోజుకో కొత్త పేరు ప్ర‌చారంలోకి వ‌స్తోంది. త‌మిళ దర్శ‌కుడు శంక‌ర్ మొద‌లుకొని… టాలీవుడ్‌లో నాగ్ అశ్విన్ వ‌ర‌కు వాళ్ల‌తో ప్ర‌భాస్ సినిమా చేయ‌బోతున్న‌ట్టు వార్త‌లొచ్చాయి. తాజాగా మ‌రో ద‌ర్శ‌కుడి పేరు వినిపిస్తోంది. ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు.. `వార్` ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్‌. హిందీలో హృతిక్‌రోష‌న్‌, టైగ‌ర్ ష్రాఫ్ క‌థానాయ‌కులుగా `వార్‌` చిత్రాన్ని తెర‌కెక్కించి విజ‌యాన్ని అందుకున్నాడు సిద్ధార్థ్‌. ఆయ‌న ఇటీవ‌ల ప్ర‌భాస్‌కి క‌థ వినిపించాడ‌ట‌. అది పాన్ ఇండియా సినిమాగా చేద్దామ‌ని ప్ర‌భాస్ కూడా మాటిచ్చిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. మ‌రి అందులో నిజ‌మెంత‌న్న‌ది తెలియాల్సి ఉంది. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా చిత్రీక‌ర‌ణ‌తో బిజీగా ఉన్నారు. ఆ చిత్రం క‌నీసం 75 శాతం అయితే త‌ప్ప కొత్త సినిమా వివ‌రాలు బ‌య‌టికొచ్చే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు.