మ‌ళ్లీ ప్ర‌భాస్‌- నీహారిక పెళ్లి?

Last Updated on by

మెగాడాట‌ర్ నీహారికపై పుకార్లు ఏమాత్రం ఆగ‌లేదు. ఇదివ‌ర‌కూ `ఒక మ‌న‌సు` కోస్టార్ నాగ‌శౌర్య‌తో పెళ్లి వ‌ర‌కూ వ్య‌వ‌హారం వెళ్లింద‌ని ప్ర‌చార‌మైంది. నాగ‌బాబు కాదంటే, మెగాస్టార్ స‌ముదాయించి ఒప్పించాడ‌ని.. ఇక పెళ్లి భాజా మోగేందుకు అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయ‌ని ప్ర‌చార‌మైంది. ఆ త‌ర‌వాత దానిని నీహారిక‌, నాగ‌శౌర్య ఇద్దరూ విడివిడిగా ఇంట‌ర్వ్యూల్లో ఖండించారు. ఇలాంటి సిల్లీ రూమ‌ర్స్ నాకు అల‌వాటైపోయాయ‌ని, ప‌రిప‌క్వ‌త వ‌చ్చినప్ప‌టినుంచి ఇలాంటివి లైట్ తీస్కుంటున్నాన‌ని నీహా చెప్పుకొచ్చింది.

అప్ప‌ట్లోనే నీహారిక‌- ప్ర‌భాస్‌కు పెళ్లి అంటూ వేరొక వార్త ప్ర‌చార‌మైంది. యువ‌నాయిక‌పై ఇబ్బ‌డి ముబ్బ‌డిగా ఓ సిరీస్‌లా ఈ త‌ర‌హా ప్ర‌చారం సాగ‌డం చూస్తుంటే అస‌లేం జ‌రుగుతోందో అన్న క‌న్ఫ్యూజ‌న్ మెగాభిమానులు స‌హా తెలుగు జ‌నాల్లో నెలకొంది. అయితే ఆ త‌ర‌వాత ఈ పెళ్లి వార్త‌ల‌న్నీ అబ‌ద్ధ‌పు ప్ర‌చారం అని తేలింది. అయితే అప్ప‌టితో అది అయిపోలేదు. లేటెస్టుగా ఉత్త‌రాది మీడియాలో, అటు ఒడిసా మీడియాలో అదే ప‌నిగా బాహుబ‌లి స్టార్ ప్ర‌భాస్‌ని, మెగాస్టార్ క‌జిన్ నీహారిక పెళ్లాడేస్తోందోచ్‌.. అంటూ ప్ర‌చారం సాగుతోంది. అయితే ఇదంతా బాలీవుడ్ మీడియా అత్యుత్సాహం. ఓవైపు ప్ర‌భాస్ `సాహో` బిజీలో ఉన్నారు. మ‌రోవైపు నీహారిక కెరీర్‌ని చ‌క్క‌దిద్దుకునే ప‌నిలో ఉంది. అయితే ఇండియా టుడే క‌థ‌నం ప్ర‌కారం… ఈ వార్త‌ల్ని మెగాస్టార్ ఖండించారు. బాలీవుడ్ లైఫ్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ నీహారిక ఇంకా యంగ్ గాళ్ .. త‌ను కెరీర్‌పై దృష్టి సారించింద‌ని, పెళ్లి వార్త‌లు అవాస్త‌వ‌మ‌ని చిరంజీవి ఖండించారని స‌ద‌రు క‌థ‌నం పేర్కొంది. ఒడిసా టీవీ, బాలీవుడ్ లైఫ్ స‌హా ప‌లు వెబ్‌సైట్ల‌లో ఈ త‌ర‌హా క‌థ‌నాలు తెలుగు మీడియాని మించి వండి వార్చ‌డం చూస్తుంటే ఇదంతా బాలీవుడ్ మీడియా అత్యుత్సాహం అని చెప్ప‌క త‌ప్ప‌దు.

User Comments