ప్ర‌భాస్ ఒక్క అడుగుకి ముహూర్తం

Last Updated on by

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఒక్క అడుగు చిత్రానికి ముహూర్తం ఫిక్సైందా? సాహో త‌ర్వాత ఆ చిత్రాన్ని కూడా ప్రారంభించ‌నున్నారా? అంటే అవున‌నే స‌మాచారం అందుతోంది. బహుబ‌లి హిట్ తో ప్ర‌భాస్ నేష‌న‌ల్ స్టార్ అయ్యాడు. బాలీవుడ్ ఆఫ‌ర్లు మీద ప‌డుతున్నాయి. అయినా చేతిలో ఉన్న క‌మిట్ మెంట్లు పూర్త‌య్యే వ‌ర‌కూ అటువైపు చూసేది లేద‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఈ నేపథ్యంలో పెదనాన్న కృష్ణం రాజు డ్రీమ్ ప్రాజెక్ట్ ఒక్క అడుగు ఎప్పుడు సెట‌స్ కు వెళ్తుందో క్లారిటీ లేకుండా పోయింది. బాహుబ‌లి కంటే ముందుగా పెద్దాయ‌న ఎంతో ఇష్ట‌ప‌డి రాసుకున్న క‌థ. స‌మాజాన్ని చైత‌న్య ప‌రిచే క‌థ అని…ఒక్క అడుగు వెయి అడుగులకు నాంది పల‌కాల‌న్న ఓ మంచి కానెప్ట్ తో రాసుకున్న‌ట్లు వెల్ల‌డించారు.

నాటి నుంచి స‌రైన ద‌ర్శ‌కుడి కోసం వెతుకుతున్నారు. సొంత బ్యాన‌ర్లోనే ఆ చిత్రాన్ని నిర్మించాల‌ని చూస్తున్నారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం కృష్ణం రాజు ఓ స్టార్ డైరెక్ట‌ర్ ని లాక్ చేసి పెట్టారుట‌. త‌ను రాసుకున్న క‌థ‌కు….ఎలా తీస్తే బాగుంటుందో? విజువ‌లైజేష‌న్ చేసి చూపించాడుట ఆ డైరెక్ట‌ర్. త‌ను అనుకున్న‌ది ఆ డైరెక్ట‌ర్ ప‌క్కాగా విజువ‌లైజేష‌న్ లో చూపించ‌డంతో వెంట‌నే అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసారుట‌. ఇప్ప‌టికే బాగా ఆల‌స్య‌మైన నేప‌థ్యంలో లేటు చేయ‌కూడ‌ద‌ని వీలైంత‌న త్వ‌ర‌గా సెట్స్ కు వెళ్లాల‌న్న విష‌యాన్ని ప్ర‌భాస్ దృష్టికి తీసుకెళ్లారుట‌.

ఆయ‌న కూడా సానుకూలంగా స్పందించిన‌ట్లు స‌మాచారం. సాహో షూటింగ్ పూర్త‌యిన వెంట‌నే చేద్దామ‌ని ప్ర‌భాస్ అన్నాడుట‌. సాహో షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకుంది. దీంతో పాటు జాన్ లో న‌టిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. ఈ నేప‌థ్యంలో దాంతో సంబంధం లేకుండా ఒక్క అడుగు ప్రారంభిస్తే నే బాగుంటుంద‌ని ఆలోచ‌న చేస్తున్నారుట‌. ఈ చిత్రంలో కూడా యూవీ వాటా కూడుతుంద‌ని స‌మాచారం.

User Comments