ప్రభాస్ కోసం పోటీ పెరిగింది

Last Updated on by

ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే నిర్మాత‌ల‌కు లాభాలు త‌ప్ప న‌ష్టాలు ఉండ‌వు. కాక‌పోతే దాన్ని ప్ర‌మోట్ చేసుకునే ప‌ద్ద‌తి కూడా తెలిసి ఉండాలి. అలా తెలిస్తే గ‌న‌క కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన‌ట్లే. ఇప్పుడు ప్ర‌భాస్ సాహోను చూస్తుంటే ఇది నిజ‌మే అనిపిస్తుంది. సినిమా బ‌డ్జెట్ 200 కోట్లు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన బిజినెస్ చూస్తుంటే నిర్మాత‌లు ఎంత ప్లానింగ్ తో ఉన్నారో అర్థ‌మ‌వుతుంది. తెలుగు రైట్స్ వ‌దిలేస్తే.. హిందీలో సాహోను ఇప్ప‌టికే 130 కోట్ల‌కు కొనేసారు టి సిరీస్ భూష‌న్ కుమార్. ఇక తెలుగు రైట్స్ కూడా ఎంత త‌క్కువ వేసుకున్నా కూడా 130 కోట్ల‌కు పైగానే అమ్మే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. అంటే తెలుగు, హిందీ థియెట్రిక‌ల్ రైట్స్ రూపంలోనే 250 కోట్ల‌కు పైగానే వ‌చ్చేసాయి.

ఇక ఇప్పుడు డిజిట‌ల్ రైట్స్ కోసం పోటీ పెరిగిపోయింది. నెట్ ఫ్లిక్స్ తో పాటు అమేజాన్ కూడా ఈ రైట్స్ కోసం భారీ రేట్ పెడుతున్నారు. ఇప్ప‌టికే నెట్ ఫ్లిక్స్ తెలుగు, హిందీ, త‌మిళ్ కు క‌లిపి 50 కోట్ల‌కు ఈ డిజిట‌ల్ రైట్స్ ద‌క్కించుకున్న‌ట్లుగా వార్త‌లొస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఇంత రేట్ పెట్ట‌లేక అమేజాన్ త‌ప్పుకున్న‌ట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే మూడు భాష‌ల్లో శాటిలైట్ రైట్స్ కూడా 70 కోట్ల వ‌ర‌కు ప‌లుకుతుంద‌ని తెలుస్తుంది. ఇలా మొత్తానికి విడుద‌ల‌కు ముందే సాహో దాదాపు 400 కోట్ల బిజినెస్ చేస్తుంది. మ‌రి రేపు విడుద‌లైన త‌ర్వాత సినిమా కూడా బాగుంటే ఆ బిజినెస్ మ‌రింత పెరిగే అవ‌కాశం లేక‌పోలేదు.

User Comments