దుబాయ్ షేక్ ల‌తో ప్ర‌భాస్ ప్యాక్

Last Updated on by

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం దుబాయ్ లో ఉన్నాడు. కొన్ని రోజులుగా ఆయ‌న అక్క‌డే ఉన్నాడు. సాహోలోని మెయిన్ యాక్ష‌న్ సీక్వెన్సుల‌న్నీ అక్క‌డే చిత్రీక‌రిస్తు న్నాడు ద‌ర్శ‌కుడు సుజీత్. ఈ షెడ్యూల్ కోసం దాదాపు రెండు నెల‌లు వేచి చూసారు సాహో టీం. చివ‌రికి సాధించారు.. కొన్ని రోజులుగా అక్క‌డి బూర్జ్ ఖ‌లీఫా ద‌గ్గ‌ర కూడా మేజర్ సీన్స్ తీస్తున్నాడు సుజీత్. ఇందులో బైక్ స్టంట్స్ అద్భుతంగా ఉండ‌బోతున్నాయని తెలుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియ‌న్ స్క్రీన్ పై చూడ‌ని విధంగా సాహో యాక్ష‌న్ సీక్వెన్సులు ప్లాన్ చేస్తున్నాడు సుజీత్. ప్ర‌త్యేకంగా వీటి కోస‌మే శిక్ష‌ణ కూడా తీసుకున్నాడు ప్ర‌భాస్. ఇది ఇలా ఉంటే.. తాజాగా దుబాయ్ లోని ప్ర‌ముఖుల‌ను క‌లిసే ప‌నిలో బిజీగా ఉన్నాడు ప్ర‌భాస్.Prabhas Saaho Longest Schedule Going Well in Abu Dhabiఅబూ దాబిలో టైగర్ జిందా హై తర్వాత ఇండియన్ మూవీస్ లో ఎక్కువ రోజులు షూటింగ్ జరుపుకొంటున్న రెండవ సినిమా సాహో. బాహుబ‌లి పుణ్య‌మా అని ఈయ‌న్ని ప్ర‌పంచం మొత్తం గుర్తు ప‌డుతుంది ఇప్పుడు. దాంతో దుబాయ్ లో కూడా ప్ర‌భాస్ కు క్రేజ్ బాగానే ఉంది. త‌న సినిమా కోసం వెళ్లాడు క‌దా.. అదే ప‌నిలో అక్క‌డి పెద్దోళ్ల‌ను కూడా క‌లిసి త‌న సినిమా ముచ్చ‌ట్లు చెబుతున్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్. దుబాయ్ లోనూ సాహో భారీగా విడుద‌ల కాబోతుంది. 25 నిమిషాల పాటు సాగే సీక్వెన్స్ కోసం హాలీవుడ్ యాక్ష‌న్ సీన్స్ కోసం కెన్నీ బేట్స్ క‌ష్ట‌ప‌డుతున్నాడు. మొత్తానికి సాహో ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది.

User Comments