అజ్ఞాత‌వాసం చేయ‌నున్న ప్ర‌భాస్

ప్ర‌భాస్ ఏంటి.. అజ్ఞాత‌వాసం చేయ‌డం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఈ హీరో ఏం చేసినా కూడా అది తెలుగు సినిమా అయితే కాదు. ఖచ్చితంగా బాలీవుడ్ సినిమానే. ఎందుకంటే బాహుబ‌లి అలా చేసింది మ‌రి. ఇక ఇప్పుడు ఈయ‌న న‌టిస్తున్న సాహోపై కూడా అంచ‌నాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఒకే ఒక్క సినిమా అనుభ‌వం ఉన్న ద‌ర్శ‌కుడికి ఏకంగా 200 కోట్ల బ‌డ్జెట్ ఇచ్చారు యువీ క్రియేష‌న్స్. సుజీత్ చెప్పిన క‌థ‌ను ప్ర‌భాస్ కూడా అదే రేంజ్ లో న‌మ్మాడు. సాహో కూడా రెగ్యుల‌ర్ క‌మర్షియ‌ల్ సినిమా కాదు.. ఇందులోనూ గుర్రాలున్నాయి.. దాంతో పాటు యాక్ష‌న్ సీక్వెన్సులు కూడా ఉన్నాయి. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ అని చెబుతున్నా.. ఇందులో ఖచ్చితంగా ఏదో ఉంద‌నే విష‌యం అయితే అర్థ‌మ‌వుతుంది. ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టి వ‌ర‌కు హైద‌రాబాద్ లోనే జ‌రిగింది.

ఇక ఇప్పుడు దేశం దాట‌డానికి ఫిక్సైపోయారు చిత్ర‌యూనిట్. చాలా రోజులుగా ఇది ట్రై చేస్తున్నా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు కుద‌ర్లేదు. దుబాయ్ లో ఈ సినిమాకు సంబంధించి భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు సుజీత్. ఇప్ప‌టికే సుజీత్ తో పాటు సినిమాటోగ్రాఫ‌ర్ మ‌ది.. స్టంట్ మాస్ట‌ర్ కెన్నీ బేట్స్ దుబాయ్ లో లొకేష‌న్లు చూసొచ్చారు. ఇప్పుడు ఫిబ్ర‌వ‌రి 25 నుంచి అక్క‌డ షూటింగ్ జ‌ర‌గ‌నుంది. ఒక‌ట్రెండు కాదు.. ఏకంగా 75 రోజుల పాటు అక్క‌డే షూటింగ్ జ‌ర‌ప‌నున్నారు చిత్ర‌యూనిట్. దుబాయ్ లో ఫ్లైయింగ్ స్క్వాడ్ యాక్ష‌న్ సీక్వెన్సులు.. రుమేనియాలో కార్ చేజింగ్ సీక్వెన్సులు.. ఇలా చాలా ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు సుజీత్. ముఖ్యంగా దుబాయ్ లోని బూర్జ్ ఖ‌లీఫా ద‌గ్గ‌ర చిత్రీక‌రించ‌బోయే 20 నిమిషాల యాక్ష‌న్ సీక్వెన్స్ ఇండియ‌న్ సినిమాల్లోనే నెవ‌ర్ బిఫోర్ అన్న‌ట్లుగా ఉంటుందంటున్నాడు ద‌ర్శ‌కుడు సుజీత్. ఈ చిత్రం ఖచ్చితంగా ఇండియ‌న్ ఫిల్మ్ హిస్ట‌రీలో బెస్ట్ యాక్ష‌న్ మూవీగా నిలిచిపోతుంద‌ని భావిస్తున్నారు. 2019 స‌మ్మ‌ర్ కు సాహో విడుద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధాక‌పూర్ ఇందులో హీరోయిన్ గా న‌టిస్తుంది.

User Comments