డార్లింగ్ మ‌ళ్లీ స్కిప్ కొట్టాడా

Prabhas getting trolled for Saaho

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ మ‌ళ్లీ వెకేష‌న్ కి వెళ్లాడా? యూర‌ప్ ట్రిప్ తో రిలీఫ్ చిక్క‌లేదా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశాన్ని బ‌ట్టి తెలుస్తోంది. డార్లింగ్ ఇటీవ‌లే యూర‌ప్ లో కొద్ది రోజులు ఎంజాయ్ చేసి హైద‌రాబాద్ లో అడుగు పెట్టాడు. దీంతో మ‌ళ్లీ య‌థావిధిగా జాన్ షూటింగ్ లో జాయిన్ అవుతాడ‌ని అంతా భావించారు. మ‌రో వైపు జాన్ టీమ్ సెట్ నిర్మాణం  ప‌నులు కూడా పూర్తిచేసిన నేప‌థ్యంలో ప్ర‌భాస్ రాక‌నే ఆల‌స్యంగా భావించారు. అయితే తాజాగా మ‌రోసారి ప్ర‌భాస్ ఫారిన్ వెళ్లార‌ని వార్త‌లొస్తున్నాయి.

రాజీవ్ గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్టులో డార్లింగ్ స్నేహితుల‌తో క‌లిసి టూర్ వెళ్తున్న‌ట్లు ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్  అవుతోంది. యూర‌ప్ ని డార్లింగ్ ఒంట‌రిగా ఆస్వాదిస్తే లేటెస్ట్ టూర్ మాత్రం దోస్తుల‌తో ప్లాన్ చేసిన‌ట్లు వినిపిస్తోంది. దీంతో జాన్ షూటింగ్ లో ఈ నెల‌లో డార్లింగ్ జాయిన్ కావ‌డం కాద‌ని తేలిపోయింది. వ‌చ్చే ఏడాదిలోనే జాన్ టీమ్ తో ప్ర‌భాస్ జాయిన్ కానున్నాడ‌ని తాజా స‌న్నివేశాన్ని బ‌ట్టి తెలుస్తోంది. ఏదేమైనా ఈ వార్త మీడియా స‌హా అభిమానుల్లో కొత్త చ‌ర్చ‌కు దారి తీస్తోంది.